TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజీ ..బీఆర్ఎస్ ప్రభుత్వంపై BJP నేత బండి సంజయ్ ఘాటు విమర్శలు విమర్శలు చేశారు. ఇదీ లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అంటూ ఎద్దేవా చేశారు.

TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

Bandi Sanjay criticizes BRS govt over TSPSC exams leak, group-1 question paper leaks

TSPSC Paper Leak : కేసీఆర్ సర్కార్ తీరుపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి మరోసారి విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. TSPSC పరీక్షలన్నీ లీక్, గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీక్ అయిన ఘటనపై బండి బీఆర్ఎప్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఇదీ లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? ప్రవీణ్ కోసం ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే నని డిమాండ్ చేశారు బండి సంజయ్. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ టీంకు లీక్ అయ్యాయని.. గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ
అయ్యిందని వీటిపై న్యాయ విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఈ లీకేజీలపై న్యాయవిచారణ జరిపించకపోతే నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్సీఎస్సీని ముట్టడిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని..గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. అత్యధికంగా ప్రవీణ్ కు 103 మార్కులొచ్చాయని..దీనికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను బండి సంజయ్ ప్రస్తావించారు.
ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని కూడా మార్చేశారని..అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే…ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని వెల్లడించారు బండి సంజయ్.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

ఇంతటి దారుణం జరుగుతున్నా..ఈ విషయం ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదని..ఇది ఈ ప్రభుత్వం చేసే ఘనకార్యం అంటూ ఎద్దేవా చేశారు. దీనివెనుక పెద్ద మతలబు ఉందని..సీఎం కేసీఆర్ తోపాటు టీఎస్పీఎస్పీ పెద్దల పాత్ర లేనిదే ఇంత పెద్ద ఘటన జరగడం అంత ఈజీ కాదన్నారు బండి. కేసీఆర్ హయాంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీకేజీ అయ్యాయనే అనుమానం కలుగుతోందని అనుమానాన్ని వ్యక్తంచేశారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం కూడా కేసీఆర్ టీంవద్ద ఉందనే మాకు సమాచారం ఉందని.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ప్రకటనను విడుదల చేసినవాటిలో ముఖ్యాంశాలు..
సీఎం కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోంది.

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఉద్యోగాలకున్న డిమాండ్‌ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలురైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం..

మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారు.

కానీ పరీక్షపత్రం లీకేజి వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది.

దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోంది.

ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి.

టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ముందుగానే గ్రూప్-1 ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను సేకరించి పరీక్ష రాశారు.

ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే… ప్రవీణ్ కోసం పరీక్ష రాసే సమయ వేళలను కూడా మార్చేసినట్లు తమ ద్రుష్టికి వచ్చింది.

ఈ అంశంపై ఓ పత్రికలో వార్త వచ్చేదాకా టీఎస్పీఎస్సీ స్సందించనేలేదు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలొస్తున్నాయి

మాకు వస్తున్న ఫిర్యాదులు, సమాచారాన్ని పరిశీలిస్తే…టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ కుటుంబానికి ముందుగానే చేరుతున్నాయని అర్ధమవుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.