Profits in Watermelon Cultivation : 2 ఎకరాల్లో పుచ్చసాగు..3 నెలల్లో ఆదాయం రూ. 2 లక్షలు

2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సీజనల్ గా పుచ్చసాగుచేస్తున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో .. 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున నాటారు.

Profits in Watermelon Cultivation : 2 ఎకరాల్లో పుచ్చసాగు..3 నెలల్లో ఆదాయం రూ. 2 లక్షలు

Cultivation of Watermelon

Profits in Watermelon Cultivation : మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, సంప్రదాయ పంటల స్థానంలో, సీజనల్ పంటలను సాగుచేస్తున్నారు రైతులు . ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి, తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే పంట దిగుబడులను పొందుతున్నారు. ఇదే కోవలోకి వస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్. 2 ఎకరాల్లో సీజనల్ గా మూడు పుచ్చ రకాలను సాగుచేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతుకు అండగా నిలుస్తున్నాయి అనటానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇక్కడి పుచ్చసాగు విధానం. ఇసుకతోకూడిన ఎర్రనేలల్లో, సాగునీటి వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో నాణ్యమైన అధిక దిగుబడులను తీస్తున్నారు , అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం మండలం, కేసినపల్లి గ్రామానికి చెందిన రైతు దొమ్మేటి శ్రీనివాస్.

2 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సీజనల్ గా పుచ్చసాగుచేస్తున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో .. 3 ఎకరాలు ఎల్లో రకం, రెడ్ రకం, అవుట్ సైడ్ ఎల్లో ఇన్ సైడ్ రెడ్ రకాలను సాగుచేస్తున్నారు. ఎకరాకు 350 గ్రాముల విత్తనం చొప్పున నాటారు. మల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందిండంతో పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం పంట దిగుబడులను తీస్తున్నారు.

READ ALSO : Green Manure Cultivation : పచ్చిరొట్ట పైర్ల సాగుతో పెరగనున్న భూసారం.. దిగుబడులు పెరిగే అవకాశం

ఎకరాకు పెట్టుబడి రూ. 70 నుండి 80 వేలు పెట్టారు. దిగుబడి 20 నుండి 22 టన్నులు తీస్తున్నాడు. మార్కెట్ లో సరాసరి కిలో ధర రూ. 20 అమ్మినా , ఎకరాకు 2 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను లక్షరూపాయల నికర ఆదాయం పొందుతున్నారు. అంటే 2 ఎకరాలకు 3 నెలల్లోనే రూ. 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు రైతు శ్రీనివాస్ . ఈ రైతును చూసి , తోటి రైతులు కూడా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలి.