ప్రయోగాత్మకంగా అరటి సాగు.. ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి.. రూ. 2 లక్షల నికరలాభం

సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, డిమాండ్‌ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోపాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు.

ప్రయోగాత్మకంగా అరటి సాగు.. ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి.. రూ. 2 లక్షల నికరలాభం

Banana farming: 5 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా అరటి సాగు – ఏడాదికి రూ. 20 లక్షల ఆదాయం పొందుతున్న నిర్మల్ జిల్లా రైతు ( అరటి సిరులు) రైతుల ఆలోచనలు మారుతున్నాయి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, డిమాండ్‌ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోపాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో అరటిని సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

పొడవాటి అరటి గెలలు, ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో, ఎంతో చూడ ముచ్చటగా ఉంది కదూ ఈ క్షేత్రం. ప్రతి గెలలోను 10 హాస్తాలకు తగ్గకుండా వున్నాయి . మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న ఈ తోట, నిర్మల్ జిల్లా, బైంసా మండలం, హజ్గుల్ గ్రామానికి చెందిన రైతు ప్రకాష్ ది. గతంలో కూరగాయల సాగుచేసే ఈయన , ఈ సారి ప్రయోగాత్మకంగా 5 ఎకరాల్లో అరటిని సాగుచేశారు. పంట దిగుబడి బాగా వచ్చింది. తోటమీదే అరటిని వ్యాపారులు కొనుగోలు చేశారు. కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తూ.. అరటి గెలలను వారే కోత కోసుకుంటున్నారు. దీంతో రైతుకు కూలీ , రవాణ ఖర్చులు మిగులుతున్నాయి. చెప్తున్నాడు.

Also Read: ఫ్రూట్ కవర్స్‌తో మామిడి రైతులకు మంచి ఫలితాలు

ఎకరాకు కనీసంగా 30 టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట వుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం వుండదు. కిలోకు 10 రూపాయల ధర పలికినా ఈ రైతు ఎకరాకు లక్ష రూపాయల ఖర్చుపోను 2 లక్షల నికరలాభం సాధించే వీలుంది. ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకం. కానీ సున్నితమైన పంట కనుక, ప్రకృతి వైపరిత్యాలతో రిస్కు అధికం. వీటిన్నింటినీ అధిగమిస్తూ అరటిసాగులో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నారు రైతు ప్రకాష్.