Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

రసాయన ఎరువుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.తెగుళ్లు ఆశించిన మొక్కలను పీకివేయాలి. రెక్కల పురుగుల కోసం పంటలో లింగాకార పుట్టలను ఏర్పాటు చేయాలి.

Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Prevent Pests In Cotton :

Prevent Pests In Cotton : పత్తి పంటను ఆశించిన పురుగులు, తెగుళ్ల గురించి వాటి నివారణకు సంబంధించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం. వాటి బారినుండి రక్షించుకునేందుకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సరైన జాగ్రత్తలు పాటించటం ద్వారా పంటను రక్షించుకోవటంతోపాటు, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. పొలంలో వార్షిక పంట మార్పిడిని అనుసరించాలి. పత్తి పంట మధ్య వరుసలో అంతర పంటలను సాగుచేయటం ద్వారా రసం పీల్చే పంటలను దారి మళ్లించవచ్చు.

గొంగలి పురుగులు తినే పక్షి గూళ్లను పత్తి చేనుల్లో ఏర్పాటు చేయాలి. పంట ఏపుగా పెరగటానికి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఎదిగిన గొంగలి పురుగులను గుర్తించి వెంటనే ఏరివేయాలి. చీడపీడలు నివారణకు రసాయన మందులను తగిన మోతాదులో పిచికారి చేయటంతోపాటు పంట మోళ్లు, ఎండు ఆకులు, ఎండు కొమ్మలు పొలంలో లేకుండా ఎప్పటికప్పుడు రైతులు తుంచివేయాలి.

రసాయన ఎరువుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.తెగుళ్లు ఆశించిన మొక్కలను పీకివేయాలి. రెక్కల పురుగుల కోసం పంటలో లింగాకార పుట్టలను ఏర్పాటు చేయాలి. తెగుళ్ల నివారణకు క్రిమిసంహారక మందులు. పత్తిపంట 1-30 రోజుల్లో ఉన్నప్పుడు అధికంగా తెగుళ్లు, పలు రకాలుగా పంటను ఆశించి నాశనం చేస్తాయి. 40-45 రోజుల మధ్య రసం పీల్చే పురుగులు వ్యాపించే అవకాశం ఉంటుంది. 45-60 రోజుల మధ్య పూత, కాయ, తొలుచు పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు పైరు వయస్సు ఇరవై రోజులున్నప్పుడు 100 మిల్లీలీటర్ల మిథైల్ డిమిటాన్ మందును 400మి.లీ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

అదే మందును నలభై రోజుల పైరు ఉన్నప్పుడు 500 మి.లీ. నీటిలో 125 మి.లీ మందును కలిపి పిచికారి చేయాలి. 60 రోజులు ఉన్నప్పుడు 150 మి.లీ మందులో 600 మి.లీ నీటితో పిచికారి చేయాలి. మోనోక్రోటోఫాస్, మిథైల్ డిమోటాన్ ఇమిడాక్రో ప్రిడ్‌లు ఒక పాటు మందు, ఇరవై పాళ్లు నీటితో కలిపి పిచికారి చేయాలి. లేదా 15, 25, 35 రోజులకోసారి ఎకరా పొలానికి మిథైల్ మటాస్ 25 ఈసీ మందును 2 మి.లీలు 200 మి.లీ నీటితో కలిపి పంటపై పిచికారీ చేయాలి.

అలాగే డైమిథో ఏట్30ఈసీ మందును 1.5 మి.లీతో, 150 మి.లీ. నీటిని కలిపి పిచికారి చేయాలి. పాస్పామిడాన్‌ను 0.5 మి.లీటర్ల మందును, 50 మి.లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. పంట కాత దశలో 600 మి.లీటర్ల నీటితో 60మి.లీటర్ల ఎండోసల్ఫాన్ 35 ఈసీ, 750 మి.లీటర్ల నీటితో 75 మి.లీటర్ల క్లోరిఫైరిపాస్ 20ఈసీ, 900 గ్రాముల నీటితో 90 గ్రాముల కార్బరిల్ 36, 840 మి.లీటర్ల నీటితో 84 మి.లీటర్ల మోనోక్రోటోపాస్‌ను కలిపి పిచికారి చేయాలి. ఇలా పత్తి పంటను సంరక్షిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను పొందవచ్చు.