Chandrababu Remand: చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారంటే

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. న్యాయమూర్తి చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించారు. దీంతో చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు.

Chandrababu Remand: చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారంటే

Chandrababu Custody Petition

Chandrababu Remand Extended : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) ఏసీబీ కోర్టులో (ACB Court) నిరాశ ఎదురైంది. న్యాయమూర్తి చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించారు. దీంతో చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు. కస్టడీ పిటీషన్ పై చంద్రబాబును విచారించేందుకు వర్చువల్ గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  చంద్రబాబు న్యాయమూర్తి ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. చట్టానికి అందరూ సమానమే.. చట్టాన్ని నేను గౌరవిస్తా కానీ నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సింది. కానీ అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ వెల్లడించారు.

తనది 45 యేళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితం అని.. తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయటం అన్యాయం అని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టానికి అందరు సమానమే.. చట్టాన్ని గౌరవిస్తాను.. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది.. కానీ ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేశారని అన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని.. అన్యాయంగా తనను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయస్సులో తనను ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయటం బాధాకరమన్నారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన.. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు అంటూ వాపోయారు. నా మీద ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదని ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

Also Read: ఆ అపవాదు చెరుపుకోండి అంటూ బాలకృష్ణకు అంబటి సూచనలు

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని దానికి ప్రధాన సూత్రధాని చంద్రబాబే అంటూ ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు కష్టడి నుంచి రిలీవ్ చేయాలని దానికి బదులుగా హౌస్ అరెస్ట్ చేయాలని విచారణకు తాను పూర్తిగా సహకరిస్తాను అంటూ కోర్టుకు వెల్లడిస్తు పిటీషన్ వేశారు. అలాగే ఏపీ హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేశారు. కానీ చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ పొడించింది.

కస్టడీ పిటిషన్ పై బుధవారమే వాదనలు ముగిసినా కోర్టు తీర్పును వెలువరించలేదు. రిజర్వు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాది కోరగా సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్ష పూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మొదట గురువారం ఉదయానికి వాయిదా వేశారు. ఆ తర్వాత దానిని సాయంత్రం 4 గంటలకు మార్చారు. సాయంత్రం కూడా తీర్పును వెలువరించలేదు. మరోసారి తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో ఈరోజు తీర్పును వెలవరిస్తు చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించింది కోర్టు.

Also Read : అసెంబ్లీలో విజిల్ వేసిన బాలకృష్ణ .. మండిపడ్డ మంత్రి అంబటి