kodi kathi case : ‘కోడి కత్తి’ కుటుంబానికి దొరకని జగన్ అపాయింట్ మెంట్ .. 7సార్లు పిటిషన్ వేసినా బెయిల్ ఎందుకు రావడంలేదోనంటూ వాపోయిన నిందితుడి కుటుంబం

వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై ‘కోడి కత్తి’ దాడి కేసులో తమ కుమారిడికి బెయిల్ కోసం సీఎం అపాయింట్ మెంట్ కోరారు నిందితుడు కుటుంబ సభ్యులు. కానీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో 7సార్లు పిటిషన్ వేసినా బెయిల్ ఎందుకు రావడంలేదో తెలీదని వాపోయింది నిందితుడి కుటుంబం.

kodi kathi case : ‘కోడి కత్తి’ కుటుంబానికి దొరకని జగన్ అపాయింట్ మెంట్ .. 7సార్లు పిటిషన్ వేసినా బెయిల్ ఎందుకు రావడంలేదోనంటూ వాపోయిన నిందితుడి కుటుంబం

vizag airport ys jagan attack case accused kodi kathi srinu family denied appointment CM Jagan

vizag airport ys jagan kodi kathi case : కోడి కత్తి కేసు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ పై జరిగిన దాడి. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారంగా జగనే దాడి చేయించుకుని అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై నెట్టివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో కోడికత్తితో దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ గత నాలుగేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈక్రమంలో ఈ కోడి కత్తి కేసులో బెయిల్ కోసం ఎన్ ఓ సీ ఇవ్వాలని సీఎం జగన్ కు లేఖ ద్వారా కోరారు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్. దీని కోసం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. జగన్ ను కలిసేందుకు శ్రీను కుటుంబ సభ్యులు లాయర్ సలీమ్ తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కానీ జగన్ అపాయింట్ మెంట్ మాత్రం ఇవ్వలేదు. నాలుగేళ్ళుగా మా బిడ్డ రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతున్నాడని గోడు సిఎం చెప్పుకుంటామయని కోరారు. అయినా జగన్ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో నిందితుడి కుటుంబ సభ్యులు సీఎం గ్రీవెన్స్ సెల్ లో వినతిపత్రం ఇచ్చి వెనుతిరిగారు. శ్రీను బెయిల్ కు నిరభ్యంతర సర్టిఫెకెంట్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు కుటుంబం సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. కానీ జగన్ ఇవ్వలేదు. దీంతో వారు సీఎం గ్రీవెన్స్ సెల్ లో వినతిపత్రం ఇచ్చి వెనుతిరిగారు.

జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో వారు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 10టీవీతో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ తల్లి, సోదరుడు సుబ్బరాజు మాట్లాడుతూ..సిఎంను కలవటానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చామని కానీ జగన్ మాత్రం కలవటానికి అవకాశం కల్పించలేదని వాపోయారు. నాలుగేళ్లుగా మా బిడ్డ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని..మా గోడు సీఎం జగన్ కు చెప్పుకుందామని వచ్చినా ఫలితం లేదని వాపోయారు. తమ కుమారుడికి బెయిల్ పై నిరంభ్యంతర సర్టిఫకెట్ ఇవ్వాలని వేడుకోరుకునే అవకాశాన్ని కూడా కల్పించలేదన్నారు.

నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న తన బిడ్డను విడిపించాలని లేదంటే తమ కుటుంబం ఏదైనా అఘాయిత్యం చేసుకోవటానికి కూడా వెనుకాడేది లేదని దయచేసి నా బిడ్డను నా వద్దకు చేర్చండీ సీఎం సారూ అంటూ కన్నీటితో వేడుకుంటోంది నిందితుడుతల్లి. మా కుమారుడు వైఎస్ జగన్ పై దాడి చేశాడో లేదో తెలియదు…జగన్ ను ఎవరు పొడిశారో తెలియదు..కానీ దాడి వ్యవహారంలో మా కుమారుడు బలి అయ్యాడని కన్నీరు పెట్టుకుంది. మా కుమారుడు నాలుగేళ్లుగా జైల్లో ఉంచడం వల్ల మేము కష్టాలు పడుతున్నామనీ..మేం పేదవాళ్లం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ బతుకున్నాం.. ఇటువంటి పరిస్థితిలో కనీసం నాబిడ్డ బయటకు వస్తే చాలని ఆశగా ఎదురు చూస్తున్నామని..బెయిల్ ఇచ్చి మా కుమారుడిని విడిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా మని వేడుకుంది.బెయిల్ ఇవ్వటానికి ఎందుకింత ఆలస్యం జరుగుతుందో మాకు తెలియదు..ఏడు సార్లు బెయిల్ పిటిషన్ వేసినా బెయిల్ రాలేదని..వెల్లడించిందా తల్లి.

నిందితుడు సోదరుడు మాట్లాడుతూ..వైఎస్ జగన్ పై నేనైతే హత్యాయత్నం చేయలేదని నా సోదరుడు నాకు తెలిపాడని..అన్నాడు. ఈ సందర్భంగా నిందితుడు తరపు న్యాయవాది సలీమ్ మాట్లాడుతూ..నాలుగేళ్లుగా అండర్ ట్రయల్ లో ఉన్న ఖైదినీ నాలుగేళ్లుగా జైలులో పెట్టడం సరైంది కాదున్నారు.కోడికత్తి కేసులో ఎన్ ఐ ఎ చార్జి షీట్ వేసినా ఇప్పటి వరకు ట్రయల్ కూడా చేయలేదని అన్నారు.మానవీయ కోణంలో తీసుకుని ఎన్ ఓ సీ ఇచ్చి నిందితుడికి బెయిల్ ఇవ్వాలని కోరామన్నారు.కోడికత్తి ఎక్కడి నుంచి తీసుకువచ్చారో ఎన్ ఐఎ నిరూపించలేదుని స్పష్టంచేశారు.

కాగా..2018 అక్టోబరు 25న అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాస్ కోడికత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే 2019, మే 25న న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేయడంతో శ్రీనివాస్‌ బయటికి వచ్చాడు. ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్ఐఏ చేపట్టడంతో కోర్టు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. దీంతో అప్పటి నుంచి జైల్లోనే జీవితం గడుపుతున్నాడు. అయితే తమ కుమారుడు బయటకు వచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలంటూ జనుపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు కోరుతున్నారు.

కుటుంబానికి ఆధారమైన కొడుకు జైలుపాలు కావడంతో వృద్ధాప్యంలో నరకం అనుభవిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌కు బెయిల్ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలోనే తమ న్యాయవాదితో కలిసి సీఎం జగన్‌ని అపాయింట్ మెంట్ కోరినా ఏమాత్రం ఫలితం దక్కలేదని కన్నీరు పెట్టుకున్నారు.