AP Assembly Budget Session: గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రెండో రోజు సీఎం జగన్.. కొద్ది రోజుల క్రితం మరణించిన గౌతం రెడ్డికి సంతాపం వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ

AP Assembly Budget Session: గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగం

Cm Jagan Subhan 10tv

AP Assembly Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రెండో రోజు సీఎం జగన్.. కొద్ది రోజుల క్రితం మరణించిన గౌతం రెడ్డికి సంతాపం వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

‘గౌతం నాకు చిన్ననాటి నుంచి స్నేహితుడు. స్నేహమనేదే కాకుండా వయస్సులో సంవత్సరం పెద్దవాడు. అయినప్పటికీ ఏరోజైనా నన్ను అన్నా అనే పిలిచేవాడు. నాపై చాలా నమ్మకం ఉంచే వ్యక్తి. నాకు నచ్చే పని చేయడానికి తపన పడేవాడు. మంచి స్నేహితుడ్ని, మంచి ఎమ్మెల్యేని కోల్పోయామంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది’

‘యూకే లండన్ లో మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు ఉండటానికి సాహసించిన కొద్ది వ్యక్తుల్లో గౌతమ్ ఒకడు’

Read Also : ఏపీ అసెంబ్లీలో రచ్చ స్టార్ట్.. టీడీపీ ఆందోళనలు, నినాదాలు

‘దుబాయ్ వెళ్లినప్పుడు కూడా నాకు రోజూ అప్ డేట్స్ చేస్తుండేవాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే వ్యక్తి కాబట్టి పారిశ్రామిక వేత్తలతో ఇతర దేశస్థులతో మాట్లాడగలిగేవాడు’ అని సీఎం జగన్ వెల్లడించారు.
.
ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుకు మేకపాటి గౌతమ్ డ్యాం అని నామకరణం చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.