SomuVeerraju On Narayana Arrest : జగన్, బొత్సలలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? నారాయణ అరెస్ట్‌పై సోమువీర్రాజు స్పందన

సర్కారీ బడుల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయిన వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు.(SomuVeerraju On Narayana Arrest)

SomuVeerraju On Narayana Arrest : జగన్, బొత్సలలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? నారాయణ అరెస్ట్‌పై సోమువీర్రాజు స్పందన

Somu Veerraju On Narayana Arrest

SomuVeerraju On Narayana Arrest : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఎవరిని బాధ్యులను చేస్తారని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రశ్నించారు. నారాయణ విద్యాసంస్థల్లో పేపర్ లీక్ జరిగిందని ఆరోపిస్తూ మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. మరి సర్కారీ బడుల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయిన వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేస్తారని సోమువీర్రాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ని అరెస్ట్ చేస్తారా? లేక విద్యాశాఖ మంత్రి బొత్సను అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీశారు.

”విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావడం లేదు. ప్రభుత్వానికి దిశానిర్దేశం లేదు. నారాయణను అరెస్ట్ చేశారు. అదే విధంగా 70మంది ప్రభుత్వం స్కూల్ టీచర్లను కూడా సస్పెండ్ చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నారాయణ విద్యా సంస్థల్లో పేపర్ లీక్ అయిందని నారాయణను అరెస్ట్ చేశారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో పేపర్ లీక్ కి ఎవరు బాధ్యత వహిస్తారు? నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి నారాయణ బాధ్యత వహించారు. మరి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారా. జగనా? బొత్సనా?” అని సోమువీర్రాజు ప్రశ్నించారు.(SomuVeerraju On Narayana Arrest)

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు.

పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో నిన్న(మే 10) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకూ సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనారాణి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ సందర్భంగా రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

10th Class Paper Leak : టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీక్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..గంగాధర్‌రావు వాంగ్మూలంలో కీలక విషయాలు

నెల్లేపల్లి కేంద్రంగా ఏప్రిల్‌ 27న జరిగిన పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్‌ ప్రాక్టీసు వ్యవహారంలో నారాయణను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రశ్నపత్రం వాట్సప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. మాల్‌ప్రాక్టీస్ ఘటనలో మాజీ మంత్రి నారాయణ, డీన్‌ బాలగంగాధర్‌ల పాత్రకు ఆధారాలున్నాయని తమ విచారణలో తేలిందని చెప్పారు. ఆధారాలు కోర్టులో సమర్పిస్తామని తెలిపారు.

Sajjala : మాజీమంత్రి నారాయణ అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖలు రాశారు. ఈ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌ను చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనక కూడా దురుద్దేశం ఉందన్నారు.

ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలన్నారు.