Minister Jogi Ramesh : ఏ తప్పు చేయకపోతే గోడ దూకి ఎందుకు పారిపోయాడు? చింతకాయల అయ్యన్నపై మంత్రి జోగి రమేష్ ఫైర్

విజయ్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాలని అన్నారు. చింతకాయల విజయ్ స్త్రీల మాన ప్రాణాల గురించి దారుణమైన రీతిలో వెబ్ సైట్ లో పోస్టులు పెట్టాడని మంత్రి ఆరోపించారు.

Minister Jogi Ramesh : ఏ తప్పు చేయకపోతే గోడ దూకి ఎందుకు పారిపోయాడు? చింతకాయల అయ్యన్నపై మంత్రి జోగి రమేష్ ఫైర్

Minister Jogi Ramesh : టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసుల ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. విజయ్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాలని అన్నారు.

చింతకాయల విజయ్ స్త్రీల మాన ప్రాణాల గురించి దారుణమైన రీతిలో వెబ్ సైట్ లో పోస్టులు పెట్టాడని మంత్రి ఆరోపించారు. నాడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న తండ్రి (అయ్యన్నపాత్రుడు) పొక్లెయిన్ తీసుకెళితే పారిపోయాడని, నేడు తప్పుడు పని చేసి కొడుకు (విజయ్) పారిపోయాడని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఐటీడీపీని పర్యవేక్షిస్తోంది చింతకాయల విజయ్ అని మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు. రాజ్యాంగం టీడీపీ వాళ్లకు వర్తించదనుకుంటున్నారా? అందుకే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు.

చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు వెళితే దాడి చేసినట్టు అసత్య కథనాలు రాశారని ఆయన మండిపడ్డారు. ఒక దొంగకు ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. అలాంటి వాళ్లను సమర్థిస్తే రేపు మీ కుటుంబ సభ్యులపైనా పోస్టులు పెడతారని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సీఐడీ పోలీసులు వెళితే రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు మరో మంత్రి మేరుగు నాగార్జున. ఒక స్త్రీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఈ మీడియా ఎలా సమర్థిస్తుంది? అని మంత్రి ప్రశ్నించారు.

చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని, ఐటీడీపీలో అతడి పోస్టులు దారుణంగా ఉంటాయని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన పనులకు చంద్రబాబు, లోకేశ్ వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. చింతకాయల విజయ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి నాగార్జున తేల్చి చెప్పారు.

హైదరాబాద్ లోని చింతకాయల విజయ్ నివాసంలో సీఐడీ పోలీసులు బీభత్సం సృష్టించారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఐడీ స్పందించింది.

చింతకాయల విజయ్ కి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించింది. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేస్తున్నందునే విజయ్ కి నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. ‘భారతి పే’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ హస్తం ఉందని ఏపీ సీఐడీ ఆరోపించింది.