AP Govt : రేషన్ కార్డు దారులకు బిగ్ రిలీఫ్..ఈ – కేవైసీ గడువు పెంచారు

(ఈ-కైవైసీ) గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో 15 రోజుల వరకు పొడిగిస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.

AP Govt : రేషన్ కార్డు దారులకు బిగ్ రిలీఫ్..ఈ – కేవైసీ గడువు పెంచారు

E Kyc

E-KYC : ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ (ఆ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచారం జరుగుతుండటంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ-కేవైసీ కోసం మీ-సేవ, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ముందే కరోనా వేవ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిల్లలతో మహిళలు కేంద్రాల వద్దకు చేరుకోవడంతో కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.

Read More :Sonia Aggarwal : ‘7/G బృందావన కాలని’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..

ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ వినిపించింది. రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ-కైవైసీ) గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో 15 రోజుల వరకు పొడిగిస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం…ఈ- కేవైసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే.
గడువు ఎందుకు పొడిగించాల్సి వచ్చిందో కారణాలు తెలియచేశారు కోన శశిధర్.

Read More : Panneerselvam Wife Dies : పన్నీర్ సెల్వం సతీమణి కన్నుమూత

వరుసగా సెలవులు రావడం, ఆధార్ కేంద్రాల్లో సర్వర్లు పనిచేయకపోవడం, పండుగలు రావడం…తదితర కారణాలు వెల్లడించారు. పలు చోట్ల ఆధార్ కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన క్రమంలో…గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా..ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయస్సున్న పిల్లలకు మారం సెప్టెంబర్ వరకు గడువు ఉంటుందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15వ తేదీలోగా చేయించుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తానికి ఏపీ పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఊరట చెందారు.