AP Government: 31లోగా బకాయిలన్నీ క్లియర్ అవుతాయి: కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత ఏపీ సర్కారు ప్రకటన

ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలు వివరాలు తెలిపారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని అన్నారు. కొవిడ్ వల్ల సమయానికి చేయాల్సింది చేయలేకపోయామని తెలిపారు. సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని తెలిపారు. పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

AP Government: 31లోగా బకాయిలన్నీ క్లియర్ అవుతాయి: కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత ఏపీ సర్కారు ప్రకటన

AP Government

AP Government: ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలు వివరాలు తెలిపారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని అన్నారు. కొవిడ్ వల్ల సమయానికి చేయాల్సింది చేయలేకపోయామని తెలిపారు. సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని తెలిపారు.

పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. జీపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు వంటి అన్నింటినీ ఈ నెలాఖరుకు క్లియర్ చేస్తామని చెప్పారు. రూ.3 వేల కోట్లకుపై బిల్లులను ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తామని, రాబోయే రోజుల్లో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అన్నీ పూర్తి చేస్తామని అన్నారు.

ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ… “ఇవాళ జరిగింది చాయ్.. బిస్కట్ మీటింగ్ కాదు. ఈ నెల 31 లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు. 16 వేల కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి బయోమెట్రిక్ తీసేయాలని చెప్పాము. 60 నుంచి 62 ఏళ్ల మధ్య వయసు ఉండి ఉన్న గురుకులాలు నాన్ టీచింగ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62 వరకు పెంచుతారు. ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్ కార్డ్ లకు సంబంధించి సీఎస్ తో సమావేశం ఉంది. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలని డిమాండ్ చేశాం. కొవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆలస్యం అవుతుందని మంత్రులు తెలిపారు. కొవిడ్ ఎఫెక్ట్ ఈ ప్రభుత్వం ఉన్నన్ని నాళ్లు ఉంటుందా? ఏంటీ?” అని అన్నారు.

Kishan Reddy: కేంద్ర పథకాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్