AP High Court : దేవాదయశాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే .. ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేస్తూ కీలక వ్యాఖ్యలు

దేవాదయశాఖ సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.

AP High Court : దేవాదయశాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే .. ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేస్తూ కీలక వ్యాఖ్యలు

AP High Court stays Srikanth's appointment as adviser to endowment

దేవాదయశాఖ సలహాదారుగా  జ్వాలాపురం శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసం దేవాదయశాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

శ్రీకాంత్ నియామక జీవోను నిలిపివేస్తూ హైకోర్టు స్టేను వదిలేస్తే..రేపు అడ్వకేట్ జన్ రల్ కు కూడా సలహాదారును నియమిస్తారు అంటూ వ్యాఖ్యలు చేసింది. సలహాదారులను నియమించుకోవటానికి అధికారుల కొరత ఉందా? అంటూ ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నించింది కోర్టు. సలహాదారులు సలహాదారులుగా ఉండకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. అంతేకాదు ఈ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఏకి పారేసింది. మంత్రులకు సలహాదారులు ఉండటంలో అర్థం ఉంది..కానీ శాఖలకు సలహాదారులు ఏంటి? అంటూ ప్రశ్నించింది.

కాగా..అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం కొన్ని రోజుల ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి దీన్ని మూడు ముక్కలు చేశారు. ఎవరికి వారు తమని అధ్యక్షులుగా చెప్పుకుంటున్నారు. వారిలో శ్రీకాంత్ కూడా ఒకరు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ చేరారు. ప్రభుత్వాన్ని దేవాదాయశాఖను శాసిస్తున్న ఓ కీలక స్వామీజీకి శ్రీకాంత్ చాలా కాలంగా ప్రధాన శిష్యుడిగా ఉన్నారు. ఆయన సిఫార్సు ద్వారా మొదట టీటీడీ బోర్డు సభ్యుని పదవి కోసం ప్రయత్నించారని తెలిసింది. ఆ అవకాశం రాకపోవడంతో సలహాదారు దృష్టిపెట్టారు.

చాలా కాలంగా ఈ లెటర్ పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు దేవాదయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి దేవాదాయ శాఖ సలహాదారు పోస్టు ప్రత్యేకంగా లేదు. కానీ రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా..రాజు ప్రాపకం ఉంటే పోస్టులకు కొదువా అన్నట్లుగా శ్రీకాంత్ దేవాదయశాఖ సలహాదారుడుగా ఓ పోస్ట్ క్రియేట్ చేసి మరీ నియమించేసింది ప్రభుత్వం. ఇలా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఎన్ని విషయాల్లో మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారటంలేదు..పదే పదే చీవాట్లు పెట్టించుకోవటం అలవాటుగా మారిపోయింది ఏపీ ప్రభుత్వానికి..