Kodali Nani : జూ.ఎన్టీఆర్‌తో విడిపోయాం… మంత్రి కొడాలి నాని క్లారిటీ!

ఒకప్పుడు కలిసి ఉన్నాం..ఇప్పుడు విడిపోయామని జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani : జూ.ఎన్టీఆర్‌తో విడిపోయాం… మంత్రి కొడాలి నాని క్లారిటీ!

Kodali Nani

Updated On : November 25, 2021 / 1:45 PM IST

AP Minister Kodali Nani And Jr. NTR : ఒకప్పుడు కలిసి ఉన్నాం..ఇప్పుడు విడిపోయామని జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు జూ.ఎన్టీఆర్ కు సంబంధం ఏంటీ అంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ..జూనియర్ ఎన్టీఆర్ మధ్యనున్న ఫ్రెండ్ షిప్ పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇవి..వ్యక్తిగతంగా చేస్తున్న వ్యాఖ్యలు అని చెప్పారు. దీనిపై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. గతంలో తాము కలిసి ఉండడం జరిగిందని, ఇప్పుడు విడిపోయామంటూ క్లారిటీ ఇచ్చారు. జూ.ఎన్టీఆర్ చెబితే తాము ఎందుకు వింటామన్నారు.

Read More : Varla Ramaiah : మేనల్లుడిగా ఎన్టీఆర్ ఫెయిల్: వర్ల రామయ్య

మరోవైపు..వరదల విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అన్నమయ్య ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలా ఉంటుందని, చంద్రబాబుకు తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. ఆరు గంటల్లో 32 టీఎంసీల నీళ్లు ఎలా బయటకు వెళుతాయని తెలిపారు. వంశీ, తనకు సెక్యూర్టీ పెంచడంపై ఆయన స్పందించారు. తనకు వంశీకి సెక్యూర్టీ అవసరం లేదని, దమ్ముంటే..సెక్యూర్టీ తీసి బాబు రావాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని.

Read More : Weather Update: నేడు మరో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు!

ఇదిలా ఉంటే…

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరీపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ…టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసేందే. 2021, నవంబర్ 25వ తేదీ గురువారం ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడారు. ఇంత జరిగితే..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌టుడిగా జూ. ఎన్టీఆర్ గొప్ప‌వాడే కానీ మేన‌ల్లుడిగా విఫ‌ల‌మ‌య్యాడడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలను కంట్రోల్ చేయాల్సిన బాధ్య‌త జూ. ఎన్టీఆర్‌కి లేదా అని వర్ల రామయ్య ప్రశ్నించడం రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విషయంలో పై విధంగా మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు.