Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరి: ఉమ్మడిగా వ్యతిరేకించిన టీడీపీ, వైసీపీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బుధవారం లోక్‌స‌భ‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు

Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరి: ఉమ్మడిగా వ్యతిరేకించిన టీడీపీ, వైసీపీ

Steelplant

Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బుధవారం లోక్‌స‌భ‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉమ్మడిగా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ సింగ్‌ సమాధానమిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటికరించాలన్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయం సరైనదేనని బదులిచ్చారు. ఈసందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ వ‌ల్ల కంపెనీలు బాగ‌య్యాయ‌ని 2019-20 ఆర్థిక స‌ర్వే వెల్ల‌డించిందని, ఈక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ డిజిన్విస్ట్‌మెంట్ కూడా స‌రైన నిర్ణ‌యమేనని ప్రకటించారు.

Also Read:Andhra Pradesh : ఏపీ EAPCET షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలివే

పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ అంశాన్ని పునఃప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేదని రామ‌చంద్ర ప్ర‌సాద్ స్పష్టం చేశారు. సొంత గనులు లేకపోవడంతోనే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందన్న ఆంధ్రా ఎంపీల వాదనపై మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ స్పందిస్తూ క్యాప్టివ్ మైన్స్ లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గ‌తంలో లాభాలు ఆర్జించిందని పేర్కొన్నారు. ఉత్పాద‌క‌త త‌గ్గిపోయి, కెపాసిటి యుటిలైజేష‌న్ త‌గ్గిపోయిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విస్త‌ర‌ణ వ‌ల్ల అప్పులు పెరిగిపోయి, ఏడువేల కోట్ల రూపాయల న‌ష్టాలు వ‌చ్చాయన్న ఉక్కుమంత్రి..అందుకే పెట్ట‌బ‌డుల ఉప‌సంహ‌ర‌ణ చేయాలనీ భావిస్తున్నట్టు తెలిపారు.

Also read:Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగనిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతుల కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇచ్చామని, నష్ట‌ప‌రిహారం స‌హా వారికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామని ఉక్కుశాఖ మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ సింగ్‌ తెలిపారు. కాగా సభలో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సంతృప్తి చెందలేదు. ఈవిషయంపై వైకాపా ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ మాట్లాడుతూ..క్యాప్టివ్ మైన్స్ లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గ‌తంలో లాభాలు ఆర్జించిందన్న కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానంతో మేము అంగీక‌రించబోమని తెలిపారు. సొంత‌గ‌నులు లేక‌పోవ‌డం వ‌ల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో ప‌డిందని..నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎక్కువ శాతం వ‌డ్డీల‌కు అప్పులుచేశారని ఎంపీ భరత్ అన్నారు. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌పై పునఃప‌రిశీల‌న చేయాలని కోరారు.

Also read:Telangana Paddy Issue : ధాన్యం దంగల్.. కేంద్ర మంత్రితో భేటీ కానున్న టీఆర్ఎస్ ఎంపీలు