AP : మద్యంబాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ షాపులు బంద్!

మద్యం బాబులకు షాకింగ్ న్యూస్. వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు తెరుచుకోవు.

AP : మద్యంబాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ షాపులు బంద్!

Wine Shop

Updated On : October 17, 2021 / 5:01 PM IST

AP Vizianagaram : మద్యం బాబులకు షాకింగ్ న్యూస్. వైన్స్ షాపులు మూతపడనున్నాయి. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు తెరుచుకోవు. దీంతో మద్యం బాబులు ముందుగానే బాటిళ్లు తెచ్చుకోవడానికి సిద్ధమౌతున్నారు. ఈ వైన్స్ షాపులు మూతపడేది తెలంగాణ రాష్ట్రంలో కాదు…ఏపీలో. అయితే..అది విజయనగరం జిల్లా పరిధిలో మాత్రమే. పైడితల్లి సిరిమాను ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులు బంద్ చేయాలని ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దుకాణాలు మాత్రమే మూతపడనున్నాయి. 2021, అక్టోబర్ 18వ తేదీ సోమవారం, అక్టోబర్ 19వ తేదీ మంగళవారం పైడితల్లి సిరిమాను ఉత్సవాల సందర్భంగా..మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

Read More : Corona Vaccine : చెత్తకుప్పలో 1.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు.. భారీగా టీకాల వృథా

ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పైడితల్లి అమ్మవారు సిరిమాను సంబరాలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. దసరా మొదలుకుని..పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబురం వరకు విజయనగరమంతా..సుందరంగా ముస్తాబవుతుంది. ఉత్తరాంధ్రతో పాటు…ఒడిశా, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల్లో భాగంగా తోలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి పత్యేక పూజలు చేయనున్నారు.

Read More : Dasara : దసరా ఎంజాయ్, రూ. 222.23 కోట్ల లిక్కర్, 50 లక్షల చికెన్ సేల్!

ఇందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తోలేళ్ల ఉత్సవం రోజున ఉదయం గజపతి రాజులు ఆడపడుచైన పైడితల్లి అమ్మవారికి అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో జరిగే ప్రదాన పండుగ సిరిమానోత్సవం. రెండు రోజుల పాటు సాగే ఉత్సవాలను కనులారా చూసేందుకు…భక్తులు తరలి రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.