రాజధాని రగడ : బాబు తప్పు చేశారు..జగన్‌ది కూడా తప్పే

  • Published By: madhu ,Published On : December 29, 2019 / 02:34 PM IST
రాజధాని రగడ : బాబు తప్పు చేశారు..జగన్‌ది కూడా తప్పే

అమరావతిని రాజధానిగా పెట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు..గుంటూరు, బెజవాడ మధ్య రాజధానిని కట్టుకోవాలి..బాబు చేసిన తప్పు మరలా చేయడం కరెక్టు కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా అంశాలపై ఆయనతో 10tv మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. 

650 కిలోమీటర్లు కడప నుంచి విశాఖకు ఎలా వస్తారని ప్రశ్నించారు. అసలు రోజు రాజధానికి ఎందుకు రావాలి ? అన్నారు. గ్రామ వాలంటీర్లు ఏం పనిచేస్తున్నారో చెప్పాలన్నారు. అన్నీ పిచ్చి పనులే..ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

 

ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలే కానీ కక్షలతో కూడుకుని చేయడం తగదని, ప్రస్తుతం ఏపీలో కక్షతో కూడిన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. డివిజన్ సరిగ్గా జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంలో వంద పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. హైదరాబాద్, ఏపీ డివిజన్ కొట్టేస్తే..ఏమీ జరుగుతుందన్నారు. 

 

రాజధాని అంశంలో కేంద్రం చొరవ తీసుకుంటుందని, రాష్ట్రాలను డివిజన్ చేయడం, రాష్ట్రాలను పెంచడం, హద్దులు మార్చడం, సరిహద్దులు దిద్దడం కేంద్రానిదే. రాష్ట్రానిది కాదన్నారు. కడపలో రాజధాని పెడితే..రూ. 5 వేలు అవుతుంది..అక్కడే పెట్టండి..ఇలాంటి రీజన్స్ చెప్పడం సరికాదన్నారు. పరిపాలన చేయమంటే..సౌకర్యాలు కల్పించాలని అడుగుతుంటే..ఇదేందనన్నారు.

 

రాజధాని ఏర్పాటు చేయమని చెప్పారా ? మూడు లేదా ఐదు రాజధానులు నిర్మించాలని చెప్పారా అంటూ సూటిగా ప్రశ్నించారు. జెజవాడను రాజధాని చేయమని నెహ్రూ కూడా సూచించారని, కానీ నీలం సంజీవరెడ్డి రాజధానిని కర్నూలుకు తరలించుకపోయారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తర్వాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిందన్నారు. రెండు కులాల మధ్య ఏపీ నలిగిపోతోందని వ్యాఖ్యానించారు నాదెండ్ల. 

Read More : ఎంపీ సుజనాపై బోత్స గరం గరం..మీరు చెప్పినట్లు వినాలా