YCP Candidate Dr.Sudha : వార్ వన్ సైడ్, భారీ మెజార్టీ దిశగా వైసీపీ

బద్వేల్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అప్రతిహతంగా దూసుకపోతోంది.

YCP Candidate Dr.Sudha : వార్ వన్ సైడ్, భారీ మెజార్టీ దిశగా వైసీపీ

Badvel

Badvel By Poll : అందరూ ఊహించనిట్లే జరుగుతోంది. వైసీపీ నేతలు చెప్పినట్లుగానే వార్ వన్ సైడ్ గా మారుతోంది. బద్వేల్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అప్రతిహతంగా దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి డా.సుధ భారీ ఆధిక్యం దిశగా ముందకెళుతున్నారు. సమీప ప్రత్యర్థిపై 60వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు.

Read More : Huzurabad By Poll : హుజూరాబాద్ మండల ఓటర్లు ఎటువైపు ?

2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. ఇందులో వైసీపీ అధిక్యం కనబరిచింది. అనంతరం ఈవీంఎలను తెరిచి..ఓట్లను లెక్కించారు. రౌండ రౌండ లోనూ వైసీపీ అభ్యర్థి డా.సుధ ఆధిక్యం కనబరిచారు. 7 రౌండ్లు ముగిసే సరికి 60 వేల 765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి డా.సుధకు 74 వేల 991 ఓట్లు పోలవ్వగా…బీజేపీ అభ్యర్థి 14 వేల 226, కాంగ్రెస్ కు 4 వేల 252, నోటాకు 2 వేల 466 ఓట్లు వచ్చాయి.

Read More : Badvel By Poll: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..వైసీపీ అభ్యర్థి లీడ్

మొదటి రౌండ్ : 9వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగింది. వైసీపీ అభ్యర్థకి 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి.
రెండో రౌండ్ : వైసీపీ అభ్యర్థి అధిక్యం.
మూడో రౌండ్‌ : 23,754 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి.

Read More : Counting Of Votes : హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్

నాలుగో రౌండ్‌ : 30,412 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ.
ఐదో రౌండ్‌ : వైసీపీ అభ్యర్థి 42,824 ఓట్ల ఆధిక్యం కనబరిచారు.
ఆరో రౌండ్‌ : 52,024 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి డా.సుధ.
ఏడో రౌండ్‌ : వైసీపీ అభ్యర్థికి 10,726, బీజేపీకి 1924, కాంగ్రెస్‌కు 841 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 74, 991 ఓట్లు సాధించింది.