CMJagan On MLA Tickets : వారికి మాత్రమే టిక్కెట్లు.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం జగన్

పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. లెక్కలన్నీ బయటపెట్టి మరీ వారికి లెక్చర్ ఇచ్చారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేదని తేల్చి చెప్పారు జగన్.(CMJagan On MLA Tickets)

CMJagan On MLA Tickets : వారికి మాత్రమే టిక్కెట్లు.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం జగన్

Cm Jagan

CMJagan On MLA Tickets : పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. లెక్కలన్నీ బయటపెట్టి మరీ వారికి లెక్చర్ ఇచ్చారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. గెలిచే వారికే టిక్కెట్లు ఇచ్చేది తేల్చి చెప్పారు జగన్. ఇంకా సమయం ఉందని, జాగ్రత్త పడాలని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే పోస్టింగ్ ఊస్టింగే అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్లి తీరాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ఎలాంటి పురోగతి లేని నియోజకవర్గాల ఎమ్మెల్యేపై జగన్ సీరియస్ అయ్యారు.

pawan kalyan: మా పార్టీ అధికారంలోకి వ‌స్తే ఈ ప‌నుల‌న్నీ చేస్తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్

గడిచిన నెల రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యేల పని తీరుపై రిపోర్ట్ బహిర్గతం చేశారు వైసీపీ బాస్. 175 నియోజకవర్గాల్లో కార్యక్రమం ఎన్ని రోజులు జరిగింది? ఎవరు ఎన్ని రోజులు గడప గడపకు ప్రోగ్రామ్ కు వెళ్లారనేది లెక్కలతో సహా వివరించారు.(CMJagan On MLA Tickets)

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు కూడా కార్యక్రమం నిర్వహించని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిల పేర్లను సమీక్షలో ప్రస్తావించారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 58 రోజులు జరిగింది. 22మంది ఎమ్మెల్యేలు పది రోజుల లోపు కార్యక్రమంలో పాల్గొన్నారని, మరో ఆరుగురు కేవలం 5 రోజులు మాత్రమే ప్రజల్లోకి వెళ్లారని చెప్పారు జగన్. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు మాత్రమే ఎక్కువ రోజులు కార్యక్రమం నిర్వహించారని చెప్పారు.

అధికార పార్టీ వైసీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై సోమ‌వారం సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు పాల్గొన్న ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలంద‌రి ప్రొగ్రెస్‌ను బ‌య‌ట‌పెట్టిన జగన్.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Murali Mohan : పవన్ కళ్యాణ్ సీఎం అయితే గర్విస్తాను.. టీడీపీ నేత, సీనియర్ నటుడు వ్యాఖ్యలు..

”ప్ర‌స్తుతం ప‌నిచేసిన వాళ్ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తాను. నా మీద అలిగినా ఫ‌ర‌వా లేదు. ప‌ని చేయ‌ని వాళ్ల‌కు మాత్రం టికెట్లు ఇచ్చే ప్ర‌సక్తే లేదు. నాతో పాటు ఎమ్మెల్యేలు క‌లిసి ప‌నిచేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచే అవ‌కాశం ఉంది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు.(CMJagan On MLA Tickets)

కార్య‌క్ర‌మాన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు కేవలం ఐదు రోజుల్లోనే ముగించారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఒక్క రోజు మాత్ర‌మే తిరిగిన వారి జాబితాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఉన్నారు. మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అయితే కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఐదుగురు మంత్రులు క‌నీసం ప‌ది రోజులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు” అని జగన్ అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించిన జగన్.. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, మంచి పనులను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యం. జీవితంలో ఏ పనైనా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం. అందుకే క్వాలిటీతో కూడిన కార్యక్రమాలు చేయడం ముఖ్యం. ‘గడపగడపకు…’ కార్యక్రమాన్ని కూడా ఇలాగే నాణ్యతతో చేయాలి” అని జగన్ అన్నారు.