CM Jagan : పేదల కోసమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం : సీఎం జగన్

ప్రతీ పేదవాడి సొంతొంటి కలను ఓ అన్నగా సాకారం చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాల విలువ రూ.26 వేల కోట్లన్నారు.

CM Jagan : పేదల కోసమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం : సీఎం జగన్

Jagan

sampurna gruha hakku scheme : ఇల్లు అంటే సిమెంట్, ఇటుకల కలబోత కాదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇల్లు మానవ సుఖ, సంతోషాలకు సజీవ సాక్ష్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సోమవారం (డిసెంబర్ 21,2021) సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తన పుట్టిన రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. పేదల ఇంటి కలను నిజం చేస్తూ రెండున్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపణీ చేశామని తెలిపారు.

ప్రతీ పేదవాడి సొంతొంటి కలను ఓ అన్నగా సాకారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాల విలువ రూ.26 వేల కోట్లన్నారు. ఇల్లు ఇవ్వడం అంటే ప్రతీ అక్కాచెల్లెమ్మకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు నేరుగా ఇచ్చినట్లేనని చెప్పారు. ఓటీఎస్ ద్వారా 8.26 లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్ తోపాటు సంపూర్ణ హక్కులను అందిస్తున్నామని చెప్పారు.

Train Engine‌ Theft : ఏకంగా రైలు ఇంజిన్‌నే దొంగిలించి అమ్మేసిన రైల్వే ఇంజినీర్‌

రూ.10 చెల్లిస్తే చాలు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని చెప్పారు. తణుకులో సెంటు భూమి విలువ రూ.15 లక్షలు పలుకుతుందన్నారు. ప్రభుత్వం పేదవాడికి అందిస్తున్న భూమి విలువ రూ.30 లక్షలు అన్నారు. పేదల కోసమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పుట్టుకొచ్చిందని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా భూముల కబ్జాకు అడ్డుకట్ట పడుతుందున్నారు.

గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు కడితే ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తారని వెల్లడించారు. ఓటీఎస్ ఇళ్లను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మంచిని అడ్డుకునే వాళ్లను ప్రశ్నించాలని ప్రజలను కోరారు. టీడీపీ ప్రభుత్వంలో రుణమాఫీ కాదు కదా..వడ్డీ కూడా కట్టలేదని విమర్శించారు.

Falling Temperatures : తెలంగాణపై చలిపులి పంజా..గిన్నెదరిలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

సీఎం జగన్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్నారు. ఓటీఎస్ తో లబ్ధిదారులకు ఇంటిపై సర్వహక్కులు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వహక్కులతో రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ జరుగనుంది. రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీల మినహాయింపు కానుంది. ఈ పథకం ద్వారా దాదాపు రూ.16 వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.