AP Flood : వరద బాధితులకు సీఎం జగన్ భరోసా, అండగా ఉంటామని హామీ

వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

AP Flood : వరద బాధితులకు సీఎం జగన్ భరోసా, అండగా ఉంటామని హామీ

Jagan Visit

CM Jagan Visits Flood-Hit Areas : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం కడప, చిత్తూరులో పర్యటించిన ఆయన..2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం ఉదయం వరదలకు కకావికలమైన చిత్తూరు జిల్లా తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు.

Read More : UK Sotrovimab : ఒమిక్రాన్ పై పనిచేసే ఔషధాన్ని గుర్తించిన బ్రిటన్..79 శాతం తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడి

రెండో రోజు పర్యటనలో భాగంగా కాసేపట్లో తిరుపతి నుంచి ప్రత్యేక  హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గాన నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలానికి  వెళ్తారు. అక్కడ వరద కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలను సీఎం పరిశీలిస్తారు. ఆ తర్వాత బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ, పెనుబల్లి ప్రాంతాల్లో .. వరద నష్టాన్ని పరిశీలిస్తారు. రైతులతో సమావేశమయ్యి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

Read More : Upasana : సోదరి పెళ్లి వేడుకల్లో ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన

పెనుబల్లి నుంచి నేరుగా .. నెల్లూరులోని  భగత్‌సింగ్‌ కాలనీకి చేరుకుని.. బాధిత కుటుంబాలతో జగన్‌ మాట్లాడుతారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పూర్తికాగానే సీఎం జగన్‌.. మధ్యాహ్నం 2గంటల 5నిమిషాలకు జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని .. అక్కడ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఆ తరువాత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 2గంటల 50నిమిషాలకు రేణిగుంట బయలుదేరి వెళ్తారు.