UK Sotrovimab : ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేసే మెడిసిన్ గుర్తించిన బ్రిటన్..79 శాతం తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడి

ప్రపంచాన్ని భయపెడుతున్నకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పనిచేసే ఔషధాన్ని కనుకొంది బ్రిటన్..ఈ మెడిసిన్ 79 శాతంప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

UK Sotrovimab : ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేసే మెడిసిన్ గుర్తించిన బ్రిటన్..79 శాతం తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడి

Uk Approves New Covid Treatment, May Work Against Omicron Variant

Britain certifies Sotrovimab for antibody treatment ప్రపంచానికి మొదలైన కొత్త టెన్షన్ ‘ఒమిక్రాన్’ పై భయపడాల్సిన పనిలేదు..కొత్త వేరియంట్ పై పనిచేసే ఔషధాన్ని గుర్తించినట్టు బ్రిటన్ వెల్లడించింది. ఈ మెడిసిన్ పేరు ‘సోట్రోవిమాబ్’ అని తెలిపింది. ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ ఉపయోగించటానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. కరోనా సోకిన వారికి సోట్రోవిమాబ్ ఇంజెక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా..వారిలో మంచి ఫలితాలు కనిపించాయంటున్నారు పరిశోధకులు . ఈ ఇంజెక్షన్ తో 79 శాతం మరణించే ప్రమాదం తగ్గినట్టు వెల్లడైంది.

ఇప్పటి వరకు కరోనాతోను పోరాడిన ప్రపంచానికి ఇప్పుడు కరోనాలో కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’. టెన్షన్ మొదలైంది. ఎక్కడ విన్నా అదే మాట. కరోనాను నియంత్రించటానికి ఔషధాలు వచ్చాక కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇక కరోనా పీడ పోతుందనుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్’తో మరో కొత్త గుబులు పుట్టించింది కరోనా. మరి కరోనాకు టీకాలు వచ్చినట్లే ఈ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కు వ్యాక్సిన్ ఎప్పుడు? ఎంతకాలం పడుతుంది? ఈలోపు ఎలాంటి ఉపద్రవాలు చూడాల్సి వస్తుందో..ఎటువంటి ముప్పుకు గురికావాల్సి వస్తుందోననే భయంలో ప్రపంచ జనాభా ఉంది. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో బ్రిటన్ పరిశోధకులు చెప్పిన ఈ వార్త ఆశాజనకంగా కనిపిస్తోంది.

Read more : Omicron : రాజస్తాన్ లో ఒమిక్రాన్ కలకలం..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం మొత్తానికి కరోనా

ఈక్రమంలో ఈ ఒమిక్రాన్ కు చెక్ పెడుతుందని చెబుతున్న ‘సోట్రోవిమాబ్’ మందును నరాల ద్వారా ఎక్కించగా..కరోనా వైరస్ ఈ ‘సోట్రోవిమాబ్’ మెడిసిన్ మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుందని పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకినవారికి వెంటనే ఈ సోట్రోవిమాబ్ మెడిసిన్ మొదటి డోస్ తోనే మంచి పనితీరు కనబరుస్తుందని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా ఈ ‘సోట్రోవిమాబ్’ మెడిసిన్ వారికి అందించాలని బ్రిటన్ కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRAఏ) వెల్లడించింది. సోట్రోవిమాబ్ తో పాటు రోనా ప్రీవ్ మెడిసిన్ కూడా గణనీయంగా ప్రభావం చూపుతోందని ఎంహెచ్ఆర్ఏ తెలిపింది. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను ఈ ఔషధాలు దీటుగా ఎదుర్కొంటాయని పేర్కొంది.

Read more :Omicron : డెల్టాతో పోలిస్తే..రీ ఇన్ఫెక్షన్స్ మూడు రెట్లు ఎక్కువ!

కాగా..కరోనా సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్ ధాటికి బెంబేలెత్తిపోయిన దేశాలను తాజాగా ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న క్రమంలో దానికి కూడా చెక్ పెట్టే మెడిసిన్ రూపొందటం సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే విదేశీ విమాన యానాల ద్వారా భారత్ లో కూడా ఒమిక్రాన్ ప్రవేశించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఒమిక్రాన్ పై భయపడాల్సిన పనిలేదని దాన్నో భూతలంలా చూడొద్దని జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే సూచించింది. ఒమిక్రాన్ పై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని..ఇది ఎంత ప్రమాదకారి అన్నది ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వ్యాఖ్యానించింది. ఒమిక్రాన్ ను ఖతం చేసే ఈ ‘సోట్రోవిమాబ్’ తో ఈ కొత్త వేరియంట్ ను కూడా ఖతం చేయవచ్చనే ఆశాభావాన్ని కలిగిస్తోంది బ్రిటన్.