Omicron : డెల్టాతో పోలిస్తే..రీ ఇన్ఫెక్షన్స్ మూడు రెట్లు ఎక్కువ!

ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్​ రకాలకు తోడు కొత్త వేరియంట్​ "ఒమిక్రాన్"​ వేగంగా వ్యాపించటం ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఒమిక్రాన్ కు సంబంధించి రోజుకొక

Omicron : డెల్టాతో పోలిస్తే..రీ ఇన్ఫెక్షన్స్ మూడు రెట్లు ఎక్కువ!

Virus

Omicron :  ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్​ రకాలకు తోడు కొత్త వేరియంట్​ “ఒమిక్రాన్”​ వేగంగా వ్యాపించటం ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఒమిక్రాన్ కు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల ప్రాథమిక అధ్యయనంలో డెల్టా, బీటా వేరియంట్ లతో పోలిస్తే.. ఓమిక్రాన్ వేరియంట్ రీ ఇన్ఫెక్షన్ లకు కారణమయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని తేలింది. దక్షిణాఫ్రికా ఆరోగ్య వ్యవస్థ ద్వారా సేకరించబడిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ స్టడీకి సంబంధించిన పేపర్ మెడికల్ ప్రిప్రింట్ సర్వర్‌లో అప్‌లోడ్ చేయబడింది.

నవంబర్ 27 వరకు పాజిటివ్ సోకిన 28 లక్షల మంది వ్యక్తులలో…35,670 అనుమానిత రీ ఇన్ఫెక్షన్ లు ఉన్నాయి. 90 రోజుల వ్యవధిలో వారు పాజిటివ్‌గా పరీక్షించినట్లయితే కేసులు మళ్లీ ఇన్ఫెక్షన్లుగా పరిగణించబడతాయి.

అయితే మూడు కోవిడ్ వేవ్ లలో ప్రాథమిక ఇన్ఫెక్షన్లు సంభవించిన వ్యక్తులలో ఇటీవలి రీఇన్ఫెక్షన్లు సంభవించాయి, డెల్టా వేవ్‌లో వారి ప్రాథమిక ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంది అని దక్షిణాఫ్రికా DSI-NRF సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎపిడెమియోలాజికల్ మోడలింగ్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జూలియట్ పుల్లియం ఓ ట్వీట్ లో తెలిపారు.

వ్యక్తుల టీకా స్థితి గురించి స్టడీలో పాల్గొన్న సైంటిస్టులకు సమాచారం లేదని పుల్లియం అన్నారు. దీంతో ఓమిక్రాన్.. టీకా-ప్రేరిత రోగనిరోధక శక్తిని ఏ మేరకు తప్పించుకుంటుందో అధ్యయనం అంచనా వేయలేకపోయిందని అన్నారు. ఇక,పరిశోధకులు దీనిని తదుపరి అధ్యయనం చేయాలని యోచిస్తున్నారు.

ఇక, ఇప్పటికే 29 దేశాలకు ఒమిక్రాన్​ వ్యాప్తి చెందింది. దాంతో మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళుతున్నాయి చాలా దేశాలు. ఓవైపు విమర్శలు ఎదురవుతున్నా.. తమ ప్రజల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ లో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా,అందులోని ఓ బాధితుడు కోవిడ్ టెస్ట్ ఫలితం వచ్చే ముందే దుబాయ్ వెళ్లిపోయాడు.

ALSO READ First Omicron Patient : దుబాయ్ వెళ్లిపోయిన భారత తొలి ఒమిక్రాన్ బాధితుడు