Jagananna Vidya Deevena Funds : రూ.709 కోట్లు.. 10.85లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 జనవరి-మార్చి నెల నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. రూ.709 కోట్ల మేర ఫీజులను..(Jagananna Vidya Deevena Funds)

Jagananna Vidya Deevena Funds : రూ.709 కోట్లు.. 10.85లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్

Jagananna Vidya Deevena Funds

Jagananna Vidya Deevena Funds : జగనన్న విద్యాదీవెన పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విద్యా దీవెన చివరి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారాయన. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి.. రూ. 709 కోట్లు 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. గురువారం తిరుపతిలో పర్యటించారు సీఎం జగన్. ఇందులో భాగంగా ఎస్వీ యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేశారు.

విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువును మధ్యలో ఆపకూడదనే లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల 994 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. విద్యా దీవెన ద్వారా 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతికి తావులేని రీతిలో పథకాలను అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.

జగనన్న విద్యాదీవెన పథకం విద్యార్థుల చదువుల విషయంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిందని సీఎం వైఎస్‌ తెలిపారు. పేదరికం నుంచి బయటపడే శక్తి చదువుకు ఉందన్నారు. ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు జగన్.(Jagananna Vidya Deevena Funds)

Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..

ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాలపైన, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు జగన్. తాము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని దొంగల ముఠా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే టెన్త్ పరీక్ష పత్రాలను వాట్సాప్ ద్వారా లీక్ చేయిస్తోంది టీడీపీనే అని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

CM YS Jagan disburses Jagananna Vidya Deevena funds, Benefit For 10.85 Lakhs Students

CM YS Jagan disburses Jagananna Vidya Deevena funds, Benefit For 10.85 Lakhs Students

గత ప్రభుత్వం బడులు మూసివేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్లిందని, కానీ తమ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలను పూర్తిగా మార్చివేసిందన్నారు జగన్. గత సర్కారు బకాయిలు పెడితే, తామే చెల్లించామని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేని విధంగా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామని వివరించారు. గతంలో చంద్రబాబు వసతి దీవెన, నాడు-నేడు వంటివి ఎప్పుడైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు.

”సంక్షేమ పథకాలపై వక్రీకరణలు చేసి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలు ఎదగకూడదని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా అడ్డుకున్నారు. వాల్లు విగ్రహాలను విరిచేస్తే మనం పెట్టించాం. రైతులను కుంగదీస్తే మనం నిలబెడుతున్నాం. ప్రజలకు ఏనాడూ యెల్లో పార్టీ మంచి చేయలేదు. వారికి మద్దతు పలుకుతున్న యెల్లో మీడియా ఏమీ చేయలేదు” అని జగన్ ఫైర్ అయ్యారు.

విద్యాదీవెన పథకం వెనుక ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య.. అసలేం జరిగిందో చెప్పిన సీఎం జగన్

జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం(మూడు నెలలు) ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి.. 709 కోట్ల రూపాయలను 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చింది. జగనన్న విద్యా దీవెన కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర చదువులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు విద్యాదీవెన ద్వారా లబ్ధి చేకూరుతోంది.

ఇక ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కూడా అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏడాదికి ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు (రెండు వాయిదాల్లో), పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ.15 వేలు.. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.