Cyclone Jawad : బలపడిన వాయుగుండం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

రాగల 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని..అనంతరం తుపాన్ గా మారనుందని...

Cyclone Jawad : బలపడిన వాయుగుండం, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Ap Cyclone

AP Uttarandhra Rain : ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. భారీ నుంచి అతి భార్షాలు పడుతాయని వాతావరణ అధికారులు హెచ్చరికలతో ఎలాంటి ముప్పు వస్తుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు పడడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, తిరుపతి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో వారు తలదాచుకుంటున్నారు. తాజాగా…ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నవాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More : Ind vs Nz : రెండో టెస్టు జరిగేనా ? భారత్ – న్యూజిలాండ్ రెండో టెస్టు

రాగల 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని..అనంతరం తుపాన్ గా మారనుందని, దీనికి జొవాద్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా వద్ద తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని..దీనికారణంగా…2021, డిసెంబర్ 03వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లా యానం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Read More : India Covid-19 : సూది అవసరం లేకుండానే చిన్నారులకు కరోనా టీకా

సముద్రం అల్లకల్లోలం ఉంటుందని..మత్స్యకారులు రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ క్రమంలో…విశాఖకు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 50 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎదైనా ముప్పు తలెత్తితే..సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు…డిసెంబర్ 03వ తేద నుంచి డిసెంబర్ 05వ తేదీ వరకు విశాఖలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులను అనుమతినివ్వడం లేదని కలెక్టర్ డా.మల్లిఖార్జున ప్రకటించారు. విశాఖ కలెక్టరేట్ లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తుపాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.