Strike Banned : ఏపీ మైనింగ్ శాఖలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు

గనుల శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఎస్మా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Strike Banned : ఏపీ మైనింగ్ శాఖలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు

Strike (1) 11zon

AP Mining Department : ఏపీ మైనింగ్ శాఖలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖను అత్యవసర సర్వీసుల కింద ప్రభుత్వం పరిగణించింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లుకుండా విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. గనుల శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఎస్మా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ ప్రారంభమైంది. ఆర్థికపరమైన అంశాలపై ఇవాళ క్లారిటీ ఇస్తామని మంత్రుల కమిటీ చెబుతోంది. హెచ్ఆర్ఏ, సీపీఏ, ఐఆర్, రికవరీ, పెన్షనర్ల క్వాంటమ్ పెన్షన్లు ప్రధానంగా డిమాండ్లుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంత్రుల కమిటీ ముందు ఉంచారు. సాయంత్రం సీఎం జగన్ తో స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

PM Modi : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులకు, మంత్రుల కమిటీకి మధ్య జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. HRA శ్లాబులు, CCA కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, CPS రద్దు లాంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినా… మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. HRA శ్లాబ్‌లపై ఉద్యోగుల డిమాండ్‌లు, వాటిని నెరవేరిస్తే ప్రభుత్వంపై పడే భారం లాంటి అంశాలపై చర్చించనున్నారు.

ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు అదనపు క్వాంటం పింఛను లాంటి అంశాలపై కొన్ని ప్రతిపాదనల్ని ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచినట్టు తెలిసింది. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు పీఆర్సీ విషయంలో చాలా అంశాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో తాము ముందే ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

PM Modi : ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఇదిలావుంటే ఛలో విజయవాడకు వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడం, నిరసన విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణకు ఉద్యోగసంఘాలు నడుంకట్టాయి. ప్రస్తుత చర్చల్లో చాలా వరకు సానుకూలత తీసుకువచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఉద్యోగులు చేపట్టనున్న సహాయ నిరాకరణ విరమించుకోమని కోరామన్నారు. అయితే చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.