Devineni Uma : శాంతి భద్రతలకు దేవినేని విఘాతం కలిగించారు – డీఐజీ

శాంతి భద్రతలకు టీడీపీ నేత దేవినేని విఘాతం కలిగించారని డీఐజీ మోహన్ రావు తెలిపారు. దేవినేని ముందస్తు ప్రణాళికతో అలజడి సృష్టించారని, జి.కొండూరులో జరిగిన అలజడికి దేవినేని ఉమనే కారణమన్నారు.

Devineni Uma : శాంతి భద్రతలకు దేవినేని విఘాతం కలిగించారు – డీఐజీ

Devineni

Devineni Uma Arrest : శాంతి భద్రతలకు టీడీపీ నేత దేవినేని విఘాతం కలిగించారని డీఐజీ మోహన్ రావు తెలిపారు. దేవినేని ముందస్తు ప్రణాళికతో అలజడి సృష్టించారని, జి.కొండూరులో జరిగిన అలజడికి దేవినేని ఉమనే కారణమన్నారు. ప్రస్తుతం ఆయన్ను కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, 100 శాతం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. దేవినేని ఉమ గొడవను సృష్టించడంపై తమకు కంప్లైట్ వచ్చిందన్నారు. దేవినేని ఉమపై కంప్లైంట్ ఆధారంగా…ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతోందన్నారు. ఎంతమంది ఈ గొడవ చేశారో విచారణలో తేలుతుందని సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.

Read More : Gold Rate Today : గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం, వెండి కూడా

మాజీ మంత్రి దేవినిని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు ఉమ. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు ఆరు గంటలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారులోనే.. లాక్‌చేసుకుని కారులోనే కూర్చున్నారాయన. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. కారు అద్దాలు పగులగొట్టి ఉమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ బందోబస్తు మధ్య.. దేవినేనిని గుడివాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read More : Covid-19 Third Wave: దేశంలో కరోనా మూడో వేవ్ ముప్పు ముదురుతుంది.. అకస్మాత్తుగా జిల్లాల్లో పెరిగిన కేసులు

కొండపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన ఉమను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. టీడీపీ – వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. తమ వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారని ఉమ ఆరోపించారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.