Tollywood Strike: ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్‌ల మధ్య ముదిరిన వివాదం

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. సినీ కార్మికులు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు ఫిలిం ఛాంబర్‌కు, ఫిలిం ఫెడరేషన్ నుంచి నోటీసులు ఇవ్వాలని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని అన్నారు.

Tollywood Strike: ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్‌ల మధ్య ముదిరిన వివాదం

Tollywood Strike

Tollywood Strike: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి సినీ కార్మికులు సమ్మె చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై అటు ఫిలిం ఫెడరేషన్, ఇటు ఫిలిం ఛాంబర్ మధ్య వివాదం ముదిరినట్లు కనిపిస్తోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. సినీ కార్మికులు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు ఫిలిం ఛాంబర్‌కు, ఫిలిం ఫెడరేషన్ నుంచి నోటీసులు ఇవ్వాలని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని అన్నారు. దీంతో బుధవారం నిర్మాతలు ఎప్పట్లాగే షూటింగ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

Telugu Film Industry: టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు

మరోవైపు ఈ నిర్ణయంపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కార్మికుల వేతనాల గురించి ఆరు నెలలుగా అడుగుతున్నామని, అయినప్పటికీ వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. అందువల్లే సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నుంచి కార్మికులు షూటింగులకు హాజరు కారని అనిల్ వల్లభనేని చెబుతున్నారు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో సినీ కార్మికుల సమ్మె, వేతనాలు వంటి అంశాలపై చర్చిస్తామని కొల్లి రామకృష్ణ తెలిపారు.