Lakshmi Parvathi on Chandrababu: మా అల్లుడి గురించి నేనే చెప్పాలి.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అంటే..!

గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు.. పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు.

Lakshmi Parvathi on Chandrababu: మా అల్లుడి గురించి నేనే చెప్పాలి.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అంటే..!

Lakshmi Parvathi

టీడీపీ నేత పట్టాభి.. ముఖ్యమంత్రి జగన్ పై చేసిన కామెంట్లకు నిరసనగా.. వైసీపీ నేతలు ఏపీ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. గుంటూరు మార్కెట్ సెంటర్ లో నేతల ఆందోళనకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు.. సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు. అల్లుడి గురించి అత్తే చెప్పాలని.. చంద్రబాబు గురించి తానే మాట్లాడాలని లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ ను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.

ఇప్పటివరకూ చంద్రబాబు ఏపీలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని.. రాష్ట్రంలో రోజుకో రకంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని లక్ష్మీ పార్వతి విమర్శించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. చంద్రబాబుతో పాటు.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తిప్పికొట్టారు.

ఎన్టీఆర్ అమాయకుడని.. కుట్రలు, కుతంత్రాలు తెలియని వ్యక్తి అని సజ్జల అన్నారు. 40 ఏళ్ల రాజకీయం అనుభవం చంద్రబాబుకు ఉందని.. వ్యవస్థలను మేనేజ్ చేసి గతంలో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. లేని గంజాయిని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం నిజంగా దేవాలయం వంటిదే అని ఆ పార్టీ నేతలు భావిస్తే.. బూతులు తిట్టిన వ్యక్తిని ముందుగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

డయాబెటిక్ పేషెంట్ అయిన చంద్రబాబు.. అర లీటర్ నీటితో రోజంతా ఎలా దీక్షలు చేస్తున్నారో చెప్పాలన్నారు. నిజంగా జగన్ మోహన్ రెడ్డి అనుకుంటే.. దాడి మరో రకంగా ఉంటుందని సజ్జల తేల్చి చెప్పారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న టీడీపీకి.. గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ కోరుతుందని అన్నారు. సోమవారమే ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్టు సజ్జల చెప్పారు. రాజకీయాలు హుందాగా ఉండాలని.. జగన్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. సజ్జల.

Read More:

Paritala Sunitha: చంద్రబాబు మారాలి.. మాది కూడా సీమే.. వైసీపీకి చుక్కలు చూపిస్తాం!