Paritala Sunitha: చంద్రబాబు మారాలి.. మాది కూడా సీమే.. వైసీపీకి చుక్కలు చూపిస్తాం!

చంద్రబాబు ఓ గంటసేపు కళ్లు మూసుకుంటే, మేమేంటో చూపిస్తామని అన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత.

Paritala Sunitha: చంద్రబాబు మారాలి.. మాది కూడా సీమే.. వైసీపీకి చుక్కలు చూపిస్తాం!

Paritala

Updated On : October 22, 2021 / 12:47 PM IST

Paritala Sunitha: చంద్రబాబు ఓ గంటసేపు కళ్లు మూసుకుంటే, మేమేంటో చూపిస్తామని అన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. చంద్రబాబు సరే అంటే, ఏం చేయడానికైనా మేం సిద్ధం అని అన్నారు. చంద్రబాబు ఇకనైనా మారాలని, ఆయన ఓకే అంటే కథ వేరేలా ఉంటుందని వైసీపీ నేతలు తెలుసుకోవాలని హెచ్చరించారు. తమదీ సీమ రక్తమేనని, మాకూ బీపీలు వస్తుంటాయని అన్నారు.

తన భర్త పరిటాల రవి హత్య జరిగిన సమయంలో కూడా తమను ఓర్పుగా ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారని గుర్తు చేసుకొన్నారు పరిటాల సునీత. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలని అన్నారు. మమ్మల్ని మీ పని మీరు కానివ్వండి అని వదిలేస్తే, ఒక్క మంత్రి కూడా బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదన్నారు. మంత్రులు అదుపు తప్పి తప్పుగా మా అధినేతను తిడుతున్నారని ఆమె అన్నారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బూతులు తిట్టారంటూ.. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం.. తర్వాత జరిగిన పరిణామాలు.. ఈ క్రమంలోనే పరిటాల సునీత వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.