AmbatiRambabu On Ananthababu : చంద్రబాబులా.. తప్పు చేసినా కాపాడే తత్వం జగన్‌ది కాదు-మంత్రి అంబటి

తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని మంత్రి స్పష్టం చేశారు.

AmbatiRambabu On Ananthababu : చంద్రబాబులా.. తప్పు చేసినా కాపాడే తత్వం జగన్‌ది కాదు-మంత్రి అంబటి

Ambatirambabu On Ananthababu Row

AmbatiRambabu On Ananthababu : సుబ్రమణ్యం హత్య కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఎమ్మెల్సీ అనంత బాబును కాపాడే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తప్పు చేస్తే.. సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చట్టానికి అందరూ సమానమే, విచారణ జరపాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి తెలిపారు.

హత్య చేసినట్టు ఎమ్మెల్సీ అనంత బాబుపై అభియోగాలు వచ్చాయని.. సెక్షన్ 302, అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, అనంతబాబును పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారని మంత్రి వెల్లడించారు. తప్పు చేస్తే తప్పించాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదని మంత్రి తేల్చి చెప్పారు. అలాంటి విధానం తమకు లేదన్నారు.(AmbatiRambabu On Ananthababu)

ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

చంద్రబాబులా తప్పు చేసినా కాపాడే తత్వం జగన్ ది కాదన్నారు మంత్రి అంబటి. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబును అరెస్ట్ చేస్తుంటే ఇక సస్పెండ్ ఎందుకు? అని మంత్రి ప్రశ్నించారు. సస్పెండ్ పై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని, ప్రక్రియలో భాగంగా అన్ని జరుగుతాయని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనంత బాబే తన డ్రైవర్ ను హత్య చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కేసు రిజిస్టర్ అయి 72 గంటలు కావస్తున్నా ఎమ్మెల్సీ అనంత బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.

ఇక, పోలీసుల విచారణలో అనంతబాబు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడంతోనే తానే హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను హత్య చేయాలని భావించలేదని.. బెదిరించి వదిలేద్దామనుకున్నట్లు అనంతబాబు పోలీసులతో చెప్పారట. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు‌పై హత్య కేసు నమోదు

హత్యకు గురైన సుబ్రహ్మణ్యం.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసి కొద్ది నెలల క్రితం మానేశాడు. గురువారం రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని సోదరుడికి స్వయంగా ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపటికి సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని కారులో ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. సుబ్రమణ్యంను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.

సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై ఓ రోజంతా పెద్ద హైడ్రామా నడిచింది. ముందు పోస్ట్‌మార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారిని ఒప్పించడంతో పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. అందులో సుబ్రహ్మణ్యంది హత్యగా తేలగా.. అతడిని కొట్టడంతోనే చనిపోయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. దాడి చేయడంతో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీపై కేసు నమోదైంది.