MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు‌పై హత్య కేసు నమోదు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు.

MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు‌పై హత్య కేసు నమోదు

Kakinada Sp Ravindranath Babu

Updated On : May 22, 2022 / 8:41 AM IST

MLC Ananthababu :  డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు. అనుమానాస్పద మృతి కేసుగా ఉన్న దానిని హత్య కేసుగా మార్చామని… త్వరలోనే అనంతబాబును అదుపులోకి తీసుకుంటామ మని ఆయన చెప్పారు.

అనంతబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఐపీసీ సెక్షన్ 302 కింద కూడా కేసు నమోదు చేశామన్నారు. అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని ఏ క్షణంలో అయినా అనంతబాబును పట్టుకుని తీరతామని పోలీసులు చెప్పారు.

మొన్న గొల్లప్రోలు, తునిలలో జరిగిని రెండు కార్యక్రమాలకు అనంతబాబు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. సుబ్రహ్మణ్యం తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతబాబు పై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.