Minister Roja: మంత్రి గారూ.. నాకు పెళ్లి కావాలంటూ రోజాకు మొరపెట్టుకున్న వృద్ధుడు

ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి రోజా చిత్తూరులోని నగరిలో పర్యటించారు.

Minister Roja: మంత్రి గారూ.. నాకు పెళ్లి కావాలంటూ రోజాకు మొరపెట్టుకున్న వృద్ధుడు

Roja

Minister Roja: ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి రోజా చిత్తూరులోని నగరిలో పర్యటించారు. ఈ క్రమంలో ఆమె స్థానికులతో మాట్లాడుతుండగా ఓ వృద్ధుడు అడిగిన వింత కోరికకు షాక్ అయ్యారు.

సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. అని అందరి ఇళ్ల వారిని ప్రశ్నిస్తూ వస్తున్న మంత్రికి ఓ వృద్ధుడు ఎదురయ్యాడు. అతణ్ని కూడా నీకు ఫించన్ వస్తుందా? లేదా? అని మంత్రి ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన ఆ వ్యక్తి.. తనకు నెలనెలా ఫించన్ వస్తుందని, అయితే తాను ఒంటరిగా ఉన్నందున తనకు పెళ్లికూతురుని చూడాలంటూ కోరాడు.

క్రేజీ కోరిక విన్న రోజా.. నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘ఫించను అయితే ఇవ్వగలం కానీ పెళ్లి ఎక్కడి నుంచి చేస్తామయ్యా’ అంటూ సమాధానం ఇచ్చారు. స్థానికులు ఈ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Read Also: చిరుతో మంత్రి రోజా సరదా ముచ్చట్లు