MLA Roja : గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్యే రోజా
గౌతమ్ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే రోజా దిగ్ర్భాంతి చెందారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Roja
MLA Roja mourns : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఒక అన్నలా తనతో ఆత్మీయంగా ఉండేవారని రోజా తెలిపారు. తాను ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా తనకు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. సాదాసీదా వ్యక్తిలా మెలుగుతూ వివాదాలకు దూరంగా ఉండేవారని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి మృతి పట్ల రోజా తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురవ్వడంతో మరణించారు. ఉదయం చెస్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే గౌతమ్ రెడ్డి మృతి చెందారు. డాక్టర్లు పరీక్షించే సరికి పల్స్ దొరకలేదు. మేకపాటి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడెన్‌గా మృతి చెందడంతో అందరూ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
CM Jagan Tribute : గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం జగన్
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఇటీవలే ఆయన దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్‌ను ప్రారంభించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇండస్ట్రీ అవకాశాల గురించి వివరించారు. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. 1971లో మేకపాటి గౌతంరెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసానికి సీఎం జగన్ వెళ్లారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. గౌతమ్ రెడ్డి మృతి తీరనిలోటన్నారు. ఆత్మీయుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గౌతమ్ రెడ్డి రేపు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. దుబాయ్ పర్యటన వివరాలు చెప్పేందుకు టైమ్ అడిగారు. ఇంతలోనే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.