Nellore Trains : దెబ్బతిన్న రైల్వే ట్రాక్, సాహసోపేత ప్రయాణం చేసిన ప్రయాణీకులు

కిలోమీటర్ల దూరం పట్టాలపై నడుస్తూ వెళ్లారు ప్రయాణికులు. ఓ వైపు లగేజి మోసుకుంటూ తీవ్ర యాతన పడ్డారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా ప్రాణాలను లెక్కచేయకుండా సాహసోపేత ప్రయాణం చేశారు.

Nellore Trains : దెబ్బతిన్న రైల్వే ట్రాక్, సాహసోపేత ప్రయాణం చేసిన ప్రయాణీకులు

Nellore Railroad Routes Remain Cut Off

Nellore Trains Cut Off : నెల్లూరు జిల్లా పడుగుపాడులో నేషనల్‌ హైవే కొట్టుకుపోయింది. చెన్నె- కోల్‌కతా మార్గంలోని హైవే కొట్టుకుపోవడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు వరకు పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. మరోవైపు…నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో వరద ప్రవాహానికి మూడు కిలోమీటర్ల మేర మట్టి, కంకర కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల దూరం పట్టాలపై నడుస్తూ వెళ్లారు ప్రయాణికులు. ఓ వైపు లగేజి మోసుకుంటూ తీవ్ర యాతన పడ్డారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా ప్రాణాలను లెక్కచేయకుండా సాహసోపేత ప్రయాణం చేశారు. ఇలా పట్టాలపై నడుచుకుంటూ నెల్లూరు దాటి హైవేపైకి వచ్చి వాహనాలను పట్టుకుని తమ ప్రాంతాలకు ప్రయాణమయ్యారు.

Read More : Nalgonda : అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం

నెల్లూరు- పడుగుపాడు సెక్షన్లలో ట్రాక్‌ దెబ్బతినడంతో.. విజయవాడ డివిజన్ పరిధిలో చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు చేశార అధికారులు. మరికొన్నింటిని దారి మళ్లించారు. గుంతకల్లు డివిజన్‌లో 201 రైళ్లు ఆగిపోయాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలో 108 రైళ్లను దారి మళ్లించగా, 2 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో ఐదింటిని రీ షెడ్యూల్‌ చేశారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్లు  ఏర్పాటుచేశారు. అదనపు కౌంటర్లు ఏర్పాటుచేసి  ప్రయాణికుల టికెట్‌ ఛార్జిని వాపస్‌ చేస్తున్నారు. ట్రాక్‌ రిపేర్‌ పూర్తయ్యాక ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు. ఇవాళ ట్రాక్‌ రిపేర్ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు రైల్వే అధికారులు.

Read More : Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

ఇదిలా ఉంటే…సోమశిల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లక్షా 71 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో లక్షా 79 వేల క్యూసెక్కులుగా ఉంది. సోమశిల నుంచి పెన్నా నదికి వరద ప్రవాహం తగ్గినా నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ లోతట్టుప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 9 వేల 688 హెక్టార్లలో పంట పూర్తిగా నీట మునిగింది. 12 వందల 59 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పెన్నా నది ఉధృతికి నీట మునిగిన 29 గ్రామాల్లోని బాధితులను పడవుల సాయంతో సురక్షితప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని వెయ్యి 78 చెరువులు పూర్తిగా నీటితో నిండడంతో…గండ్లు పడకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు ఉన్నతాధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు ఆ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సామాగ్రితో తరలివెళుతున్నారు. వరదనీరు తగ్గిన ప్రాంతాల్లో 24 గంటల్లోగా విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.