Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

Kerala Court

Kerala High Court : కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళ ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతడు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది. ఆమె అందుకు ఒప్పుకుందని ఊహించుకోవడం ఎంతమాత్రమూ సరికాదని తెలిపింది. ఆమెను బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అది కిడ్నాప్‌తోపాటు అత్యాచారం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ నారాయణ తీర్పు ఇచ్చారు.

Read More : AP Three Capitals : ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి

నిస్సహాయ స్థితిలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె లైంగిక సంబంధంలో పాల్గొంటే అది అంగీకారం కిందికి రాదని, అంగీకారానికి.. లొంగుబాటుకు తేడా ఉందన్నారు. ప్రేమిస్తున్నంత మాత్రాన ఆమె అన్నింటికీ అంగీకరిస్తున్నట్లుగా భావించకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగలు విక్రయించి మళ్లీ గోవా తీసుకెళ్లాడు. అక్కడ కూడా మరోసారి అత్యాచారం చేశాడు.

Read More : Andhrapradesh : బాబు వస్తున్నాడు ! ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాల కోసం రూట్ మ్యాప్ ఖరారు

వీటన్నింటికీ అంగీకరించకపోతే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె వెళ్లకతప్పలేదు. దీనిపై కేసు నమోదవ్వగా.. ఆమె ఎక్కడా ప్రతిఘటించలేదని, అంతా అంగీకారంతోనే జరిగిందని నిందితుడు వాదించాడు. దీన్ని అంగీకరించని ట్రయల్ కోర్టు అతనికి అత్యాచారం నేరం కింద శిక్ష విధించింది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా, కింది కోర్టు తీర్పును సమర్థించింది. బాధితురాలి వయసు నిర్ధరణ కాకపోవడంతో పోక్సో చట్టం కింద విధించిన శిక్షను మాత్రం రద్దు చేసింది.