‘గారు’ అంటే అర్థం ఏంటీ ? మోడీకి ఏపీ స్టూడెంట్ సరదా ప్రశ్న

  • Published By: madhu ,Published On : August 30, 2020 / 12:33 PM IST
‘గారు’ అంటే అర్థం ఏంటీ ? మోడీకి ఏపీ స్టూడెంట్ సరదా ప్రశ్న

మోడీ గారు…‘గారు’ అంటే అర్థం ఏంటీ ? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతరులకు చెప్పారా ? అంటూ ఏపీ రాష్ట్రానికి చెందిన స్టూడెంట్ మనోజ్ కుమార్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సరదాగా ఓ క్వొశ్చన్ వేశారు. ఇతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. నీ పేరు టోనియ, మనోజ్ కుమారా ? అని మోడీ తిరిగి ప్రశ్నించారు.

పూర్తి పేరే టోనీ మనోజ్ కుమార్ అంటూ సమాధానం చెప్పాడు. ‘టోనీ గారు’ అంటూ..మోడీ వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి. గారు అంటే అర్థమేంటో ఝాన్సీ వర్సిటీ విద్యార్థులకు చెప్పారా ? అని సరదాగా అడిగారు. ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కాబట్టి..తాను తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నట్లు మనోజ్ చెప్పడం, దీనికి మోడీ తప్పకుండా..మాట్లాడండి..తనకు బాగుంటుందని చెప్పడం అందర్నీ ఆకర్షించింది.

సంక్షేమ, వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా, ఆశీర్వాదకంగా ఉన్నాయని..ఇందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో అధికంగా వండే వరి, మామిడి, చింత పండు, పొగాకు, పసుపు పంటల గురించి 22 రాష్ట్రాల విద్యార్థులకు తెలియచేయడం జరిగిందన్నారు. దీనికి ప్రధాని మోడీ స్పందించారు.

మనోజ్ మాట్లాడిన మాటలు తనకు అర్థమయ్యాయన్నారు. సేంద్రీయ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా ? అని ప్రధాని అడిగారు. కేంద్రం ప్రారంభించిన భూ సార పరీక్షలు, వేపపూత యూరియా వల్ల ఎరువుల వినియోగం 10 శాతం తగ్గిందని ఆ మేరకు రైతులకు, భూమికి మేలు జరుగుతోందని మనోజ్ వెల్లడించారు.

యూపీలోని ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీ బాయి వ్యవసాయ విశ్వ విద్యాలయ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.