Paritala Vs Thopudurthi: పరిటాల వర్సెస్ తోపుదుర్తి.. రోజురోజుకు వేడెక్కుతున్న రాప్తాడు రాజకీయం
నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించారు. వైసీపీ వారికి వసూళ్లు చేయడం అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు.

Paritala Vs Thopudurthi: రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి అన్నట్లుగా..హైవోల్టేజ్ పొలిటికల్ హీట్ నడుస్తోంది. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఏ వైసీపీ నేత యాక్టివ్‌గా ఉన్నా లేకున్నా.. రాప్తాడులో మాత్రం తగ్గేదేలే అంటున్నారు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. నిత్యం ఏదో ఒక ఇష్యూతో డైలాగ్ వార్‌కు దిగుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాప్తాడులో పరిటాల ట్యాక్స్‌తో ప్రజలు హడలెత్తిపోతున్నారని తోపుదుర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతీ పనికి ఇంత కమిషన్ అని వసూల్ చేస్తున్నారన్నారు.
8 కార్లు, గన్లు.. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన సొమ్ము?
ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం దాకా వెళ్లిందని వారి నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారని అలిగేషన్స్ చేస్తున్నారు. ప్రతీ లబ్దిదారుడి నుంచి కనీసం పది వేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పేదలైన లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫైరయ్యారు తోపుదుర్తి. పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇంచార్జిగా ఉన్న ధర్మవరంలోనూ బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయన్నారు తోపుదుర్తి. ఆయుధ పూజలో ఎనిమిది కార్లు, గన్లను పూజించారని ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన సొమ్ము అని తోపుదుర్తి నిలదీశారు.
ఇక తోపుదుర్తి ఆరోపణలపై పరిటాల సునీత తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించారు. వైసీపీ వారికి వసూళ్లు చేయడం అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ 10 మందికి పెట్టే వాళ్లమే కానీ తీసుకునే వాళ్లం కాదని అన్నారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటు హెచ్చరించారు.
కమీషన్లు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు..
టీడీపీ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు కమిషన్లు దోచుకుంటున్నారని మరోసారి తోపుదుర్తి ఆరోపించారు. తాను ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సింది పోయి చెప్పు తెగుద్ది అనడమేంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిపించే సత్తా కూటమి ప్రభుత్వం పెద్దలకు ఉందా అని సవాల్ చేశారు. ధర్మవరంలో కూడా చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్న విషయాలు చెబితే బెదిరిస్తారా అని తోపుదుర్తి మండిపడ్డారు.
ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించిన వారిని చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే హోదాలో ఉన్న పరిటాల సునీత బెదిరించడం ఏంటంటూ తోపుదుర్తి కూడా తీవ్రస్థాయిలోనే రియాక్ట్ అవుతున్నారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తుంచుకోవాలని ప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పరిటాల కుటుంబం అంటేనే దానం చేసే కుటుంబం అని చెప్పుకుంటున్న..ఎమ్మెల్యే సునీతమ్మ ఎక్కడ దానం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకుని రైతుల కడుపులు కొట్టావంటూ ఫైరయ్యారు తోపుదుర్తి. పరిటాల కుటుంబం దానం చేయడం కాదు..రక్తం పిండి వసూల్ చేశారంటూ ఆరోపించారు. చెప్పు తెగుద్ది అంటూ పరిటాల సునీత చేసిన కామెంట్స్‌తో..రాప్తాడులో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.
Also Read: పార్టీ భవిష్యత్ కోసం పవన్ మాస్టర్‌ప్లాన్.. త్రిశూల వ్యూహం అంటే ఏంటి? ఎలా అమలు చేస్తారు?