పార్టీ భవిష్యత్‌ కోసం పవన్‌ మాస్టర్‌ప్లాన్‌.. త్రిశూల వ్యూహం అంటే ఏంటి? ఎలా అమలు చేస్తారు?

గత ఎన్నికల్లో మిలీనియల్స్ మద్దతుగా నిలిచారని.. వచ్చే ఎన్నికల్లో జెన్ జీని ఆకట్టుకునేలా పనిచేయాలని పవన్ సూచించారు.

పార్టీ భవిష్యత్‌ కోసం పవన్‌ మాస్టర్‌ప్లాన్‌.. త్రిశూల వ్యూహం అంటే ఏంటి? ఎలా అమలు చేస్తారు?

Updated On : October 7, 2025 / 2:44 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ త్రిశూల వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఏపీలో పార్టీ భవిష్యత్ దిశగా.. మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. జనసేన పార్టీ తీసుకున్న త్రిశూల వ్యూహం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మూడు దిశల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇంతకీ వ్యూహంలో కీలకమేంటి.. దీని అమలులో సవాళ్లు ఎదురుకావడం ఖాయమా?

జనసేన పార్టీ భవిష్యత్తు దిశలో కీలకమైన అడుగుగా.. త్రిశూల వ్యూహం పేరుతో పవన్ కల్యాణ్‌ మాస్టర్‌ స్కెచ్‌ వేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలన్నది పవన్ ఆలోచన.

పార్టీ విస్తరణకు సంబంధించి పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఆపరేషన్‌ 100కు సిద్ధం అయ్యారు. అంటే.. ప్రతి జనసేన ఎమ్మెల్యేకు కనీసం ఐదు నియోజకవర్గాల బాధ్యతను అప్పగించేందుకు రెడీ అయ్యారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ.. 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని.. జనసైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలని.. వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు పవన్‌.

Also Read: ఇది సినిమా కాదు.. భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు.. అక్కడితోనూ ఆగకుండా.. దేవుడా…

మూడు దిశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందిన ఈ వ్యూహం.. పార్టీ భవిష్యత్తు దిశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. త్రిశూల వ్యూహం మూడు ప్రధాన అంశాలపై సాగుతోంది.. ప్రభుత్వంలో పాత్ర, పార్టీ బలపరచడం, ప్రజా సంబంధాలు. మొదటిగా ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వస్థాయిలో పరిష్కరించడమే కాకుండా.. జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు.

రెండు పార్టీ బలపరచడం. ఎన్నికల తర్వాత కూడా కేడర్ మోటివేషన్ నిలబెట్టడం, బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలకు నేరుగా సూచనలు ఇచ్చి, పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం కనిపిస్తోంది. మూడవది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ జనాల మనసుకు దగ్గరగా ఉండే విధంగా పవన్ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపై వెంటనే స్పందించడం ఇవన్నీ ఈ వ్యూహం భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు.

జెన్ జీని ఆకట్టుకునేలా..

గత ఎన్నికల్లో మిలీనియల్స్ మద్దతుగా నిలిచారని.. వచ్చే ఎన్నికల్లో జెన్ జీని ఆకట్టుకునేలా పనిచేయాలని పవన్ సూచించారు.త అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి యువతలో పవన్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన ఈ గెలుపు వెనక యూత్ పాత్ర చాలా కీలకం.

ఐతే ఇప్పుడు జెన్‌జీని ఆకట్టుకోవాలన్న పవన్ మాటల వెనక భారీ వ్యూహమే కనిపిస్తోంది. 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్.. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జెన్‌జీ అంటారు. గత ఎన్నికల్లో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత.. జనసేనకు అండగా నిలిచారన్నది పవన్ నమ్మకం. అదే నిజం కూడా ! యువత మద్దతు పొందితే భవిష్యత్తులోనూ బలంగా ఉండొచ్చే ఆలోచన పవన్ మాటల్లో కనిపిస్తోంది. దీనికోసం జెన్‌జీని ఆకట్టుకునే వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నారు.

ఇక త్రిశూల వ్యూహం అమలులో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన చర్చ కూడా సాగుతోంది. త్రిశూల వ్యూహం సరైన రీతిలో అమలైతే.. పార్టీ కేవలం కూటమి భాగస్వామిగా కాకుండా, భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉందనేది మరికొందరి వాదన. ఇక ఈ వ్యూహం కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, పవన్ కల్యాణ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీగానూ భావిస్తున్నారు. ఒకవైపు జనాలతో అనుసంధానం కొనసాగిస్తూ.. ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఏ లెవల్‌లో వర్కౌట్ అవుతుందో చూడాలి.