ఇది సినిమా కాదు.. భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు.. అక్కడితోనూ ఆగకుండా.. దేవుడా…

ఆమె తన చెల్లి భర్తతో (మరిదితో) సంసారం కొనసాగిస్తోంది. బావతో పారిపోయిన మహిళ తిరిగి ఇంటికి వచ్చింది.

ఇది సినిమా కాదు.. భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు.. అక్కడితోనూ ఆగకుండా.. దేవుడా…

Representative image

Updated On : October 7, 2025 / 2:01 PM IST

Sisters Swap Husbands: నేటి తరం యువత తీరు సమాజంలోని మానవ సంబంధాలు, నైతిక విలువలను మంటగలిపేలా ఉంటోంది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు.

ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపగా, ఆ ఇద్దరు యువతులు తమ భర్తలతో కొన్నాళ్లు కాపురం చేసి, పిల్లలను కని, ఆ తర్వాత భర్తలను మార్చుకున్నారు. అక్కడితోనూ ఆగకుండా పిల్లలను కూడా మార్చుకున్నారు. (Sisters Swap Husbands)

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ చిన్న గ్రామంలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు పదేళ్ల క్రితం సంబంధాలు చూసి పెళ్లి చేశాడు.

Also Read: తప్పు చేస్తే ఒప్పేదే లే.. ఏపీ నకిలీ లిక్కర్‌ కేసులో ట్విస్ట్ ఏంటి? సెగలు కక్కుతున్న కేసు వ్యవహారం

ఆ అక్కాచెల్లెళ్లలో చెల్లి తన అక్క భర్తతో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, ఏడు నెలల క్రితం భర్త, పిల్లలను వదిలి బావతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తుండగా, ఈ విషయం తెలుసుకున్న ఆమె అక్క కూడా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.

ఆమె తన చెల్లి భర్తతో (మరిదితో) సంసారం కొనసాగిస్తోంది. బావతో పారిపోయిన మహిళ తిరిగి ఇంటికి వచ్చింది. భర్తలను మార్చుకుని జీవించాలని ఆ అక్కాచెల్లెళ్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాట్లాడుకుని పిల్లల్నీ మార్చుకోవాలని అనుకున్నారు. అక్క తన ముగ్గురు పిల్లలను చెల్లికి ఇచ్చింది. చెల్లి తన ఇద్దరు పిల్లలను అక్కకు ఇచ్చింది.

చెల్లి తన కొత్త భర్తతో అంటే మరిదితో తండ్రి ఇంటికి చేరడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబం నిజం తెలిసి ఆశ్చర్యపోయింది. తండ్రి కోపంతో తన కుమార్తెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.

ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి చేరలేదు. ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. స్థానికులు దీన్ని ఆ కుటుంబ అంతర్గత వ్యవహారం అని అంటున్నారు.