Botcha Satyanarayana: మాజీమంత్రి బొత్సకు తృటిలో తప్పిన ప్రమాదం..

సిరిమాను సంబరాన్ని బొత్స ఫ్యామిలీ వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంగణం కాకుండా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేశారు.

Botcha Satyanarayana: మాజీమంత్రి బొత్సకు తృటిలో తప్పిన ప్రమాదం..

Botsa Satyanarayana

Updated On : October 7, 2025 / 11:04 PM IST

Botcha Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. పైడితల్లి సిరిమానోత్సవం వీక్షిస్తున్న బొత్స కుటుంబం కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వర్షం పడిన కారణంగా మట్టి కుంగడంతో వేదిక నేలకొరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ సురేష్ బాబుకి, ఓ పోలీస్ అధికారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

కూలిన వేదిక నుంచే సిరిమానోత్సవాన్ని వీక్షించారు బొత్స దంపతులు. సిరిమాను జాతర సందర్భంగా మాజీ మంత్రి బొత్స, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జునకు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సిరిమాను సంబరాన్ని బొత్స ఫ్యామిలీ వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంగణం కాకుండా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే స్టేజ్ కూలిపోయింది.

వేదిక కూలిపోవడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: పరిటాల వర్సెస్ తోపుదుర్తి.. రోజురోజుకు వేడెక్కుతున్న రాప్తాడు రాజకీయం