Purandeswari : చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్.. ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయాలు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి,కుమారుడు లోకేశ్ తో పాటు పురంధేశ్వరి కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

Purandeswari : చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్.. ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయాలు

Purandeswari To Meet Chandrababu In Jail

Purandeswari To Meet Chandrababu In Jail : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి,కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ ములాఖత్ లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే  నారా భువనేశ్వరి సోదరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు అరెస్ట్ అయ్యాక లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ వంటి కుటుంబ సభ్యులు మాత్రమే ములాఖత్ అయ్యారు. వీరితో పాటు పార్టీ ముఖ్యనేతలు కూడా ములాఖత్ అయ్యారు.  కానీ మొదటిసారి పురంధేశ్వరి చంద్రబాబుతో ములాఖత్ కావటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read: అనారోగ్య కారణాలతో చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోంది : లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ లో పురంధేశ్వరి కూడా ఉండటంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ అధ్యక్షురాలి వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో ఆమె చంద్రబాబుతో ములాఖత్ కావటం ఆసక్తికరంగా మారింది. కాగా..చంద్రబాబును అరెస్ట్ అయిన తరువాత బీజేపీ పార్టీ తరపున ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి స్పందించిన విషయం తెలిసిందే. ఈ స్పందనపై కూడా విమర్శలు వచ్చాయి. ఆ తరువాత అమిత్ షాతో లోకేశ్ తో పాటు ఆమె కూడా ఉండటం..తాజాగా చంద్రబాబుతో కుటుంబ సభ్యులతో కలిసి ములాఖత్ లో పాల్గొనటం కూడా హాట్ టాపిక్ గా మారింది. కాగా చంద్రబాబుతో ములాఖత్ కోసం నారా లోకేశ్ ఇప్పటికే ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు.