3 Capitals : అమరావతి నిర్మాణంపై సజ్జల హాట్ కామెంట్స్.. కొత్త జిల్లాల కసరత్తు పూర్తి

అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని తేల్చారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమౌతుందా ? ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా ? అని ప్రశ్నించార

3 Capitals : అమరావతి నిర్మాణంపై సజ్జల హాట్ కామెంట్స్.. కొత్త జిల్లాల కసరత్తు పూర్తి

Amaravati

Construction Of Amaravati : అమరావతి నిర్మాణంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2022, ఏప్రిల్ 02వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని తేల్చారు. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమౌతుందా ? ఒక ప్రాంత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా ? అని ప్రశ్నించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం వివరించడం జరిగిందని గుర్తు చేశారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటీ అన్నారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఆయన స్పందించారు. కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యిందని, దీనికి సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందన్నారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు పడుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ కేంద్రాలు బేస్ చేసుకుని జిల్లాల విభజన జరుగుతోందన్నారు. ఇక అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read More : Amaravathi: 3 రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు

CRDA చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోర్టు తీర్పులో వెల్లడించింది. రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని కూడా చెప్పింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని..రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు వాడకూడదని ప్రభుత్వానికి సూచించింది. అభివృద్ధి పనుల విషయంలో ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే.. సీఎం జగన్ తగ్గేదే లేదంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్లు, రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజధాని నిర్ణయం తమదే అని ఎక్కడా కేంద్రం చెప్పలేదని.. రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్ కూడా ఫైల్ చేసిందన్నారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు హైకోర్టు ఆదేశాలు విరుద్ధమని, వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. వికేంద్రీకరణ అంటే.. అందరి అభివృద్ధి అన్నారు. మొత్తం మీద అమరావతి రాజధాని నిర్మాణంపై సజ్జల చేసిన కామెంట్స్ పై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.