Andhra Pradesh: మరింత ముందుకు నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rain (Representative image)
Andhra Pradesh – Rains: కేరళ (Kerala)లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) మరింత ముందుకు కదులుతున్నాయి. రాబోయే 24 గంటల్లో దేశంలోని పలు ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వివరించారు.
అలాగే, ఈదురు గాలులు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కాగా, తాజాగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో వానాకాలం ప్రారంభమైందని భావిస్తారు.
Telangana: తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం.. ఎక్కడెక్కడంటే?