Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి

ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అల్లూరి జయంతి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రధాని సభ అనుకున్నట్లు సజావుగానే సాగుతుంది. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి. రేపు ప్రధాని.. అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను కలుస్తారు.

Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి
ad

Modi Meeting: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సభ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణతోపాటు, బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అల్లూరి జయంతి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రధాని సభ అనుకున్నట్లు సజావుగానే సాగుతుంది.

Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు

ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి. రేపు ప్రధాని.. అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను కలుస్తారు. వారికి సన్మానం కూడా చేస్తారు. పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అల్లూరి జయంతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ సభకు బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. అల్లూరి జయంతిని బీజేపీ రాజకీయం చేస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదు. అన్ని రాజకీయ పార్టీల నేతలను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది’’ అని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.