Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు

సిటీ పోలీసులతోపాటు, ఎస్పీజీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రధాని బస చేసే ప్రాంతంలో ఇప్పటికే 144 సెక్షన్ అమలవుతోంది. డ్రోన్స్ ఎగరేయడంపై కూడా నిషేధం ఉంది. పరేడ్ గ్రౌండ్స్ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు

Modi Meeting

Modi Meeting: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మోదీ పర్యటించే ప్రాంతాలన్నీ భద్రతా వలయంలో ఉన్నాయి. ప్రధాని భద్రత చూసే ఎస్పీజీ ప్రతిక్షణం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. మోదీ పర్యటించే ప్రాంతాల్లో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్స్ నిరంతంర భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల పరిధిలోని ప్రాంతాలన్నీ స్నైపర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీల నిఘాలో ఉన్నాయి.

Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

సిటీ పోలీసులతోపాటు, ఎస్పీజీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రధాని బస చేసే ప్రాంతంలో ఇప్పటికే 144 సెక్షన్ అమలవుతోంది. డ్రోన్స్ ఎగరేయడంపై కూడా నిషేధం ఉంది. పరేడ్ గ్రౌండ్స్ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్స్ ఫ్లై ఓవర్ పూర్తిగా మూసేశారు. చుట్టు పక్కల బిల్డింగ్స్‌ను కూడా ఎస్పీజీ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. బేగంపేట్ విమానాశ్రయం, హెచ్ఐసీసీ, నోవాటెల్, పరేడ్ గ్రౌండ్స్, రాజ్ భవన్ చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆంక్షల దృష్ట్యా నగరవాసులు సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.