Home » Author »Narender Thiru
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
విమానాల్లో చాలా మంది ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం లేదని ఒక ప్రయాణికుడు వేసిన పిల్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ సూచనలు చేసింది. జస్టిస్ విపిన్ సంఘి ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.
వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పలు సంచలనాత్మక నిర్ణయాలు, అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ముఖ్యంగా ఆయన తన కంపెనీలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటుంటాయి.
వచ్చే నెల హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.
తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రారని, అయితే ఆయన మద్దతు జనసేనకు ఉంటుందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు. పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నాగబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.
రామంతపూర్‌లో ఇటీవల శ్రీకాంత్ అనే యువకుడికి, మరో యువతితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే శ్రీకాంత్‌కు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ విషయంపై శ్రీకాంత్ భార్య లక్ష్మి స్పందించింది.
తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంతో ఒక మహిళను చితకబాదింది కాంగ్రెస్ లీడర్ భార్య. ఈ ఘటన తాజాగా గుజరాత్లో జరిగింది. గుజరాత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.200 సబ్సిడీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఉజ్వల పథకం కింద సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే ఇకపై సబ్సిడీ అందనుంది.
విశ్వ నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అప్పుడే బ్లాక్‌బస్టర్ అంటూ రివ్యూ ఇచ్చేశాడు తమిళ హీరో, పొలిటీషియన్ ఉదయ నిధి స్టాలిన్.
కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి స్వైన్‌ఫ్లూ. కొంతకాలంగా దేశంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అందులోనూ మరణాలు ఇంకా తక్కువ. అయితే, తాజాగా కేరళలో స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది.
దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.
నాని, నజ్రియా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైంది. విశాఖపట్నంలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ ట్రైలర్ లాంఛ్ చేశారు.
వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.
సరైన శిక్షణ పొందకుండానే విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఇలాంటి పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిద్ధూ మూసేవాలా హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గురువారం సిద్ధూ తండ్రిని కలిశారు.
రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.