Elon Musk: టెస్లాలో పది శాతం ఉద్యోగాల కోత అవసరం: ఎలన్ మస్క్

పలు సంచలనాత్మక నిర్ణయాలు, అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ముఖ్యంగా ఆయన తన కంపెనీలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటుంటాయి.

Elon Musk: టెస్లాలో పది శాతం ఉద్యోగాల కోత అవసరం: ఎలన్ మస్క్

Elon Musk

Updated On : June 3, 2022 / 5:22 PM IST

Elon Musk: పలు సంచలనాత్మక నిర్ణయాలు, అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ముఖ్యంగా ఆయన తన కంపెనీలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటుంటాయి. తాజాగా అలాంటి ఒక నిర్ణయమే తీసుకున్నారు ఎలన్ మస్క్. టెస్లా కంపెనీలో పదిశాతం ఉద్యోగుల కోత విధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేసిన అంచనా ప్రకారం కనీసం పదిశాతం ఉద్యోగుల కోత అవసరమని అంటున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధులకు ఎలన్ మస్క్ పంపిన మెయిల్ లీకైంది. ఓ మీడియా సంస్థ ఈ మెయిల్ విషయాన్ని వెల్లడించిది.

BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు

లీకైన మెయిల్‌లో కంపెనీలో ఉద్యోగుల కోత అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికిప్పుడు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఆపివేయాలని టెస్లా ఎగ్జిక్యూటివ్స్‌ను ఆదేశించారు. ప్రపంచంలో ఎక్కడా టెస్లా తరఫున కొత్త ఉద్యోగుల్ని తీసుకోవద్దని సూచించారు. అయితే, ఈ అంశంపై కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని, ఆఫీసుకు వచ్చి పని చేయాలని కూడా ఎలన్ మస్క్ ఉద్యోగుల్ని ఇటీవల కోరారు. లేకుంటే టెస్లాను విడిచిపెట్టి వెళ్లాలని సూచించారు.