Covid protocol: అలాంటివాళ్లను విమానం నుంచి దించేయండి: ఢిల్లీ హై కోర్టు

విమానాల్లో చాలా మంది ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం లేదని ఒక ప్రయాణికుడు వేసిన పిల్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ సూచనలు చేసింది. జస్టిస్ విపిన్ సంఘి ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.

Covid protocol: అలాంటివాళ్లను విమానం నుంచి దించేయండి: ఢిల్లీ హై కోర్టు

Covid Protocol

Updated On : June 3, 2022 / 7:22 PM IST

Covid protocol: కోవిడ్ రూల్స్ పాటించని ప్రయాణికులను అసవరమైతే విమానం నుంచి దింపేయాలని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. విమానాల్లో చాలా మంది ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం లేదని ఒక ప్రయాణికుడు వేసిన పిల్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ సూచనలు చేసింది. జస్టిస్ విపిన్ సంఘి ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. విమాన ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ‘‘ఎయిర్‌పోర్టుల్లో, విమానాల్లో ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం తప్పనిసరి. ఈ రూల్స్‌ను విమానయాన సంస్థలు కచ్చితంగా అమలు చేయాలి.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

ఈ నిబంధనలకు సంబంధించి కెప్టెన్స్, పైలట్స్ సహా సిబ్బందికి తగిన సూచనలు చేయాలి. కోవిడ్ రూల్స్ పాటించని ప్రయణికులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్ వాడాలి. తినేటప్పుడు, డ్రింక్స్ తీసుకునేటప్పుడు మాత్రమే మాస్క్ తీసేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించకుంటే అవసరమైతే విమానం నుంచి దింపేయొచ్చు. ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్. వీటిని పాటించకుంటే ఫైన్స్ కూడా విధించవచ్చు. అలాంటి ప్రయాణికుల పేర్లను నో-ఫ్లై లిస్టులో చేర్చాలి’’ అని హై కోర్టు సూచించింది. ఈ నిబంధనలు అమలు చేసేందుకు తగిన గైడ్‌లైన్స్ రూపొందించాలని డీజీసీఏను ఆదేశించింది.