pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

Pawan Kalyan

pawan kalyan: వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మీడియా ప్రతినిధులతో శుక్రవారం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా పేరు వివాదం రాజకీయ కుట్ర అని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కోనసీమకే పేరు పెట్టి రెచ్చగొట్టడం వల్లే ఘర్షణలు జరిగాయన్నారు.

BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు

‘‘కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతించాం. అంబేద్కర్ పేరును అనవసరంగా రాజకీయం చేశారు. ఇలాంటి ఘటన జరిగితే రాష్ట్ర యంత్రాంగం ఏం చేస్తోంది. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు ముందే హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికీ దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం ఏంటి? ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణను కుల ఘర్షణగా మార్చారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటన జరిగింది. ఘర్షణ సమయంలో గన్‌మెన్‌లు గన్‌లు వదిలి వెళ్లారు. ఇది కూడా అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ చర్యలకు మంత్రి, ఎమ్మెల్యే బాధితులయ్యారు. డీజీపీ క్షేత్రస్థాయిలో వెళ్లి ఎందుకు స్పందించలేదు? డీజీపీ స్పందించకుంటే అమిత్ షాకు లేఖ రాస్తాం. కోనసీమ తగులబడుతుంటే ఎవరైనా బస్సు యాత్ర చేస్తారా? ఆ యాత్రతో ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా?

Nagababu: చిరంజీవి సపోర్ట్ జనసేనకే: నాగబాబు

కోనసీమ వివాదంలో మోడీకి సంబంధం లేదు. శివసేన నేతలు కొందరు మోదీకి ఆపాదించేలా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గొడవలు పెంచాలనే కుట్ర జరుగుతోంది. మీడియాలో కూడా కుల ప్రస్తావన పెరిగిపోయింది. ఎన్టీఆర్ జిల్లాకు కూడా హఠాత్తుగా పేరు పెట్టి ఉంటే గొడవలు జరిగేవి. ప్రభుత్వం అందరినీ వర్గ శత్రువులుగా భావిస్తూ ఇబ్బంది పెడుతోంది. ఉద్యమం అంటే కులాలు రావు. అందరూ కలిసి వస్తారు. సామాజిక న్యాయం నిజంగా జరిగితే ఈ గొడవలు ఉండవు. కార్పొరేషన్‌లు పెట్టిస్తేనే సామాజిక న్యాయం జరిగిపోదు. బీసీలను ఉద్ధరించాం అంటున్నారు. ఆ కార్పొరేషన్‌లు ఏం చేస్తున్నాయో వాళ్లకైనా తెలుసా? మోదీని చూసే బీజేపీతో పొత్తు గురించి ఆలోచించా. ఆత్మకూరులో కుటుంబ సభ్యులకు సీటు ఇస్తే పోటీ చేయకూడదనేది మా నిర్ణయం. అన్ని కులాల వాళ్లు ఓట్లేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. నేను కులాల ఆధారంగా రాజకీయాలు చేయను. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకం పెరిగిపోతుంది. ప్రజలు కూడా రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలి. జగన్ దావోస్ పర్యటనతో ఏం సాధించారు? అక్కడ జగన్ కలిసింది ఇక్కడి వాళ్లనే. అనవసరంగా ప్రభుత్వ ధనం వృథా అనిపించింది.

Elon Musk: టెస్లాలో పది శాతం ఉద్యోగాల కోత అవసరం: ఎలన్ మస్క్

మా పొత్తు గురించి వైసీపీకి ఎందుకు? సజ్జల వంటి వారు కూడా కంగారుగా ప్రకటన చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. కానీ వైసీపీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. వైసీపీ ఉన్నంత కాలం  పోలవరం పూర్తి కాదు. అసలు ప్రభుత్వం దగ్గర నిధులే లేనప్పుడు ఎలా ఫూర్తి చేస్తారు? కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర వాటికి మళ్లిస్తున్నారు. బీజేపీతో పొత్తు, ఇతర అంశాలపై చర్చిస్తాం. పార్టీ కోసం నాగబాబు తనవంతు కృషి చేస్తారు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.