Home » Author »Narender Thiru
‘ఓవర్ ద కౌంటర్’ విధానంలో ఔషధాలు అమ్మేలా కొత్త చట్టం రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపు నుంచి మందులు కొనుగోలు చేయవచ్చు. అలాగని అన్ని రకాల మందులు కొనుగోలు చేసేందుకు వీల్లేదు.
రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది.
బీచ్‌లో మహిళ ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, జోయెల్ విన్సెంట్ డిసౌజా అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముల్తానీ మట్టితో మసాజ్ చేస్తానంటూ వెళ్లిన జోయెల్, ఆమెపై అత్యాచారం చేశాడు.
తాను అడిగిన సమాచారం ఇవ్వకుంటే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకుంటానని ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. తాను కోరినట్లుగా స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందేనని కోరాడు.
సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కరోనా ఉధృతి పెరగకపోవడం కూడా వీటి వాడకం తగ్గేందుకు ఒక కారణం. ఈ నేపథ్యంలో రెమిడిసివర్ ఇంజక్షన్లు భారీగా మిగిలిపోయాయి. చాలా మెడిసిన్లు ఎక్స్పైరీ డేట్‌కు చేరుకున్నాయి. దీంతో వీటన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉం�
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ దిగుమతుల్ని రెట్టింపు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అది కూడా తక్కువ ధరలోనే చమురు కొనుగోలు చేయాలని చూస్తోంది.
ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. పంజాబ్‌లోని సిద్ధూ స్వస్థలమైన మాన్సా జిల్లా, మూసాలో మంగళవారం రాహుల్, సిద్ధూ కుటుంబాన్ని కలుస్తారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు కుట్ర జరిగిందనే విషయం తాజాగా వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ఏర్పాటు ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయ్యారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్‌ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 24 వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్‌లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు.
ఒక పక్క మంత్రాలు, భూతవైద్యాలు లేవంటూ ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం కల్పిస్తున్నా ఇంకా సమాజంలో మార్పు రావడం లేదు. ఈ పేరుతో ఇప్పటికీ దురాగతాలు కొనసాగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.
కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఇప్పటివరకు నలుగురు అరెస్టుకాగా, మరో మైనర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.
ఒకవైపు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ చెబుతున్నా అది అమలు కావడం లేదు. ఇది మాటలకే పరిమితమవుతోంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటనే నిదర్శనం.
భారీ ఢిస్కౌంట్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి షాపింగ్ మాల్స్. తీరా అక్కడికి వెళ్లాక కండీషన్స్ పేరుతో ఏవో మెలిక పెడుతుంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు మోసపోతుంటారు.
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
కర్నూలులో ఆదివారం నిర్వహించతలపెట్టిన విరాట పర్వం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రమాదం జరిగింది. ఔట్‌డోర్ స్టేడియంలో నిర్మించిన స్టేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది.